Health Tips: మధుమేహం గురించి అపోహలు వీడండి.. నిజనిజాలు తెలుసుకోండి?

Published : Aug 26, 2023, 10:20 AM IST

Health Tips: మధుమేహం గురించి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. షుగర్ వచ్చింది కాబట్టి తను చురుకుగా ఉండలేనని, ఎక్సర్సైజులు చేయలేనని లేనిపోని అపోహలకి గురవుతూ ఉంటారు. షుగర్ గురించి లేనిపోని భయాలకి గురికాకండి. అసలు నిజా నిజాలు ఏంటో ఇక్కడ చూద్దాం.  

PREV
16
Health Tips: మధుమేహం గురించి అపోహలు వీడండి.. నిజనిజాలు తెలుసుకోండి?

మధుమేహం అనేది రక్తంలోని గ్లూకోజ్ మొత్తాన్ని సరిగ్గా నియంత్రించడంలో శరీరం విఫలమవడం అనే వ్యాధి. ఇది రెండు రకాలుగా వర్గీకరించబడుతుంది ఒకటి టైప్ వన్, రెండు టైప్ టు. అయితే ఈ మధుమేహం గురించి చాలామంది చాలా అపోహలకి గురవుతూ ఉంటారు. అయితే మధుమేహాన్ని గురించిన నిజా నిజాలు ఇప్పుడు తెలుసుకుందాము.

26

చాలామంది నా కుటుంబంలో షుగర్ లేదు కాబట్టి నాకు కూడా షుగర్ రాదు అనుకుంటారు. అయితే ఇది చాలా పెద్ద అపోహ. ఇంట్లో ఎవరికైనా షుగర్ ఉంటే షుగర్ మీకు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అంతేకానీ మీ ఇంట్లో ఎవరికీ షుగర్ లేదు కాబట్టి మీకు షుగర్ రాదని కాదు. షుగర్ రావడానికి ప్రధాన కారణం మీ జీవనశైలి.

36

ఒక్కొక్కసారి మీ జీవన శైలి క్రమబద్ధంగా ఉన్నప్పటికీ కూడా షుగర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే మధుమేహం పూర్తిగా నయం అవుతుంది అని చాలామంది అనుకుంటారు. అయితే మధుమేహం అనేది ఒక దీర్ఘకాలికమైన వ్యాధి. దీనికి పూర్తిస్థాయిలో చికిత్స లేదు. కాకపోతే అదుపులో ఉంచుకోవడానికి మాత్రమే చికిత్స అందుబాటులో ఉంది

46

కాబట్టి మధుమేహాన్ని అశ్రద్ధ చేయకండి. అలాగే నేను లావుగా లేను కాబట్టి నాకు మధుమేహం వచ్చే అవకాశం లేదు అనుకోకండి అది కూడా పెద్ద అపోహ. సన్నగా ఉన్నా, లావుగా ఉన్న కూడా మన జీవన శైలి, మన ఆహార విధానాలు, ఒత్తిడితో కూడుకున్న జీవితం వలన షుగర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

56

అలాగే షుగర్ వచ్చే స్త్రీలు బిడ్డలని కనలేరు అనేది కూడా పెద్ద అపోహ. షుగర్ ని కంట్రోల్ లో ఉంచుకుంటూ పిల్లలని చక్కగా కని పెంచి పెద్ద చేయవచ్చు. అలాగే నాకు షుగర్ ఉంది కాబట్టే ఎక్సర్సైజులు చేయలేనని, జీవితం చురుకుగా ఉండదని చాలామంది అపోహ పడుతుంటారు. కానీ అది కూడా నిజం కాదు.
 

66

క్రమబద్ధీకరణమైన జీవన విధానంతో షుగర్ ఉన్నప్పటికీ చురుగ్గా ఉంటూ ఎక్సర్సైజులు చేయవచ్చు. అలాగే చాలామంది షుగర్ కంట్రోల్ లో ఉంది అని చెప్పి మందులు తీసుకోవడం మానేస్తారు ఇది చాలా పెద్ద పొరపాటు. మీరు మందులు వాడుతున్నారు కాబట్టే షుగర్ కంట్రోల్ లో ఉంది. మీరు మందులు వాడడం మానేసిన దగ్గర నుంచి మళ్లీ షుగర్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి జాగ్రత్త పడండి.

click me!

Recommended Stories