మడమల నొప్పులు రావొద్దంటే మీరు సరైన చెప్పులను, బూట్లను వేసుకోవాలి. గట్టి నేలపై చెప్పులు లేకుండా అస్సలు నడవకండి. మంచి ఆర్చ్ సపోర్ట్, కుషన్డ్ వైబ్రేటింగ్ అందించే షూలను వేసుకోండి.
మడమ నొప్పి తగ్గాలంటే కోల్డ్ కంప్రెస్డ్ ఐస్ వేయడం, ప్లాంటార్ ఫాసియాను మసాజ్ ను చేయండి. ఇది మడమల వాపు, నొప్పిని తగ్గిస్తుంది. ఇందుకోసం బాటిలో లో నీళ్లను నింపి రాత్రంతా ఫ్రీజర్ లో ఉంచండి. ఈ వాటర్ ఐస్ గా మారినప్పుడు దానిని టవల్ లో చుట్టి ఉదయాన్నే మడమలు, పాదాలకు నెమ్మదిగా పెట్టండి. ఇది మీకు నొప్పి నుంచి చాలా ఉపశమనాన్ని కలిగిస్తుంది.
మడమల నొప్పిని తగ్గించడానికి ఇంకా ఏం చేయొచ్చు
అలోవెరా జెల్
కలబందలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇది మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. అయితే మీరు ఈ కలబందను ఉపయోగించి కూడా మడమల నొప్పిని తగ్గించుకోవచ్చు. మడమ నొప్పి తగ్గాలంటే ప్రతిరోజూ 50 గ్రాముల కలబందజెల్ ను తీసుకుని మడమలకు పెట్టండి. ఇది తక్కువ టైంలోనే మడమల నొప్పిని తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.