అంజీర్ ను అత్తి పండ్లు అని కూడా అంటారు. ఈ పండు పోషకాలకు మంచి వనరు. వీటిని ఎన్నో రకాల వంటల్లో కూడా ఉపయోగించొచ్చు. మనం ఈ పండును తాజా, ఎండబెట్టి కూడా తినొచ్చు. దీన్ని ఏ రకంగా తిన్నా మన శరీరానికి బోలెడు పోషకాలు అందుతాయి. ఈ పండులో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కె, విటమిన్ బి 6, ఇనుము, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండులో డైటరీ ఫైబర్, సహజ చక్కెరలు కూడా పుష్కలంగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారికి ఈ పండు బాగా ఉపయోగపడుతుంది. ఈ పండును తింటే జీర్ణక్రియ మెరుగ్గా పనిచేస్తుంది. శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. అసలు రోజూ అంజీర్ ను తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
figs
మీ జీర్ణక్రియను సులభతరం చేస్తుంది
అత్తి పండ్లలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ ఫైబర్ సాధారణ ప్రేగు కదలికలకు చాలా అవసరం. ఎందుకంటే ఇది మలబద్దకాన్ని నివారిస్తుంది. గట్ ను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతో మీ జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది. కరిగే ఫైబర్ వ్యర్థ ఉత్పత్తులను బంధిస్తుంది. అలాగే పేగు గుండా బయటకు వెళ్లడానికి సహాయపడుతుంది.
యాంటీఆక్సిడెంట్ గా పనిచేస్తుంది
అంజీర పండు ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ కూడా. ఇది ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స ను తటస్తం చేయడానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్లలో క్వెర్సెటిన్, కాటెచిన్స్, ఆంథోసైనిన్స్ వంటి పాలీఫెనాల్స్ కూడా ఉంటాయి. ఇవి గుండె జబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్లు వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. దీనిలో ఉండే సమ్మేళనాలు కణాల నష్టం నుంచి రక్షిస్తాయి.
figs
గుండె ఆరోగ్యం
అంజీర పండ్లు మన గుండె ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. దీనిలోని పోషకాలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అంజీర పండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది. అంతేకాదు దీనిలో ఉండే మెగ్నీషియం, డైటరీ ఫైబర్ రక్త నాళాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.అలాగే ఇది రక్తపోటును నియంత్రించడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
ఎముకల ఆరోగ్యం
మన అస్థిపంజరాన్ని, ఎముకలను బలంగా ఉంచడంలో అంజీర పండు కీలక పాత్ర పోషిస్తుంది. అంజీర్ లో ఎముకల నిర్మాణం, బలంగా ఉంచడానికి అవసరమయ్యే కాల్షియం, భాస్వరం, మెగ్నీషియం ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఈ ఖనిజాలు ఎముక సాంద్రతను మెరుగుపరుస్తాయి. అలాగే బోలు ఎముకల వ్యాధితో పాటుగా ఎముకలకు సంబంధిత సమస్యల ప్రమాదాన్నికూడా తగ్గిస్తాయి.
రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహిస్తుంది
అంజీర్ తీయగా ఉన్నా.. దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అంటే వీటిని మధుమేహులు కూడా తినొచ్చు. దీనిలోని ఫైబర్ చక్కెరల శోషణ మందగించడానికి సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు ఫాస్ట్ గా పెరిగే అవకాశం ఉండదు.
బరువు నిర్వహణ
బరువు తగ్గాలనుకునే వారికి కూడా అంజీర్ పండ్లు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ పండ్లలో ఉండే డైటరీ ఫైబర్ కడుపును తొందరగా నింపుతుంది. అతి ఆకలిని తగ్గిస్తుంది. అతిగా తినడాన్ని తగ్గిస్తుంది. ఈ పండులో కేలరీలు తక్కువగా ఉంటాయి.
చర్మ ఆరోగ్యానికి
అంజీర పండ్లు మన చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ఈ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, విటమిన్ ఇ ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయి. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడానికి సహాయపడుతుంది. ఈ పండు సన్నని గీతలు, ముడతలను తగ్గిస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
Image: Freepik
రోగనిరోధక శక్తిని పెంచుతుంది
అత్తి పండ్లలో ఉండే పోషకాలు మన రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీనిలో ఉండే విటమిన్ సి వంటి విటమిన్లు, జింక్ వంటి ఖనిజాలు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడతాయి. మన శరీరాన్ని సంక్రమణ నుంచి రక్షించడానికి, వ్యాధులను తొందరగా తగ్గించడానికి సహాయపడతాయి. ఈ పోషకాల కలయిక శరీర రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది.