పండ్లలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం లాంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి అందరు ఇష్టంగా తింటారు. కొందరైతే ఉదయాన్నే పండ్లు తింటారు. కానీ ఖాళీ కడుపుతో పండ్లు తింటే గ్యాస్ట్రిక్ సమస్యలు, షుగర్ లెవెల్స్ పెరగడం, జీర్ణ సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. జీర్ణక్రియ మందగించి, వాపు, గ్యాస్, మలబద్ధకం, వాంతులు వస్తాయని చెబుతున్నారు.
గర్భిణులు, జీర్ణ సమస్యలున్నవారు డాక్టర్ సలహా తీసుకుని పండ్లు తినాలి. డయాబెటిస్ ఉన్నవారు ఉదయాన్నే పండ్లు తింటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయి.
ఉదయాన్నే ఏ పండ్లు తినడం మంచిది?
సాధారణంగా ఉదయాన్నే పండ్లు తినకపోవడమే మంచిది. ఒకవేళ మీరు నీళ్లు తక్కువగా తాగే వారైతే, పుచ్చకాయ, స్ట్రాబెర్రీ, పీచు, పైనాపిల్, నారింజ లాంటి నీటి శాతం ఎక్కువగా ఉన్న పండ్లను తినవచ్చు.