Drinking Coffee: పొద్దున్నే చక్కెర వేసుకోకుండా కాఫీ తాగితే ఎన్ని లాభాలో తెలుసా?

Published : Feb 01, 2025, 02:52 PM IST

ఉదయాన్నే కాఫీ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. అయితే కాఫీలో చక్కెర వేసుకోకుండా తాగితే ఎలా ఉంటుంది? దాని వల్ల కలిగే లాభాలెంటో మీకు తెలుసా?  

PREV
15
Drinking Coffee: పొద్దున్నే చక్కెర వేసుకోకుండా కాఫీ తాగితే ఎన్ని లాభాలో తెలుసా?

చాలా మందికి ఉదయాన్నే ఒక కప్పు కాఫీ తాగకపోతే అసలు డే స్టార్ట్ అయిన ఫీలింగే ఉండదు. వారి ఇష్టాలకు అనుగుణంగా కాఫీ తయారు చేసుకొని తాగుతుంటారు. కానీ కాఫీలో చక్కెర కలిపితే దాని ప్రయోజనం కాస్త తగ్గుతుందని మీకు తెలుసా? ఉదయం చక్కెర వేసుకోకుండా కాఫీ తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. చక్కెర లేని కాఫీ తాగడం వల్ల రుచిలో ప్రత్యేకమైన అనుభూతిని కూడా పొందవచ్చు.

25
బరువు తగ్గడానికి:

చక్కెర కలిపిన కాఫీ తాగితే శరీరానికి అవసరం లేని కేలరీలు పెరిగి బరువు పెరుగుతారు. అదే చక్కెర లేని కాఫీలో తక్కువ కేలరీలు ఉంటాయి కాబట్టి శరీరంలో అనవసరమైన కేలరీలు తగ్గి బరువు తగ్గుతారు.

రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది:

చక్కెర.. షుగర్ పేషెంట్లకు హానికరం. దాని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. అదే చక్కెర లేకుండా కాఫీ తాగితే షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి. డయాబెటిస్ వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి.

35
గుండె ఆరోగ్యంగా:

అధిక చక్కెర తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి చక్కెర లేకుండా కాఫీ తాగితే గుండె జబ్బుల నుంచి కొంతమేర తప్పించుకోవచ్చు. ఇది కాకుండా, కాఫీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.

జీవక్రియను మెరుగుపరుస్తుంది:

కాఫీలో ఉండే కెఫిన్ జీవక్రియను వేగవంతం చేస్తుంది. ముఖ్యంగా చక్కెర లేని కాఫీ తాగితే అది మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. చక్కెర జీవక్రియ ప్రక్రియను స్లో చేస్తుంది.

45
మెదడు పనితీరుకు:

కాఫీ మెదడు పనితీరు, సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది కాబట్టి, చక్కెర లేని కాఫీ తాగితే జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. దీని వల్ల నిరాశ తగ్గుతుంది, రోజంతా ఉత్సాహంగా ఉంటారు.

కాలేయ ఆరోగ్యానికి మంచిది:

కాఫీ తాగడం కాలేయానికి మంచిది. ముఖ్యంగా చక్కెర లేని కాఫీ తాగడం వల్ల కాలేయ వాపు, కాలేయ క్యాన్సర్ వ్యాధుల ప్రమాదం తగ్గుతుందని పరిశోధనలో తేలింది.

55
డిప్రెషన్, మూడ్ స్వింగ్స్:

చక్కెర లేని కాఫీ తాగితే, మూడ్ స్వింగ్స్, డిప్రెషన్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. కాఫీలో చక్కెర కలపకుండా తాగితే మెదడులో సెరోటోనిన్, డోపమైన్ వంటి రసాయనాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఇది మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

యాంటీఆక్సిడెంట్లు పెరుగుతాయి:

కాఫీలో అనేక రకాల యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి శరీరాన్ని రక్షించడంలో సహాయపడతాయి. చక్కెర కలిపితే అది యాంటీఆక్సిడెంట్ల సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories