కరివేపాకును మనం చాలా వంటల్లో ఉపయోగిస్తుంటాం. ఇది ఆహారం రుచిని పెంచడమే కాకుండా, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులో కాల్షియం, భాస్వరం, ఇనుము, విటమిన్ సి, విటమిన్ ఎ లాంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. రోజూ ఉదయం ఖాళీ కడుపుతో కరివేపాకు తింటే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
25
పరగడుపున కరివేపాకు తింటే కలిగే లాభాలు
ఖాళీ కడుపుతో కరివేపాకు తింటే వికారం సమస్య తగ్గుతుంది. కరివేపాకులోని గుణాలు వికారం, వాంతులు వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
కంటి ఆరోగ్యానికి మంచిది:
కరివేపాకులో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి చూపుకి చాలా మంచిది. కంటి సమస్యలను నయం చేయడంలో కరివేపాకు సహాయపడుతుంది. పరగడుపున క్రమం తప్పకుండా కరివేపాకు తింటే కంటి చూపు మెరుగుపడుతుంది.
35
డయాబెటిస్‌ని అదుపులో..
డయాబెటిస్ ఉన్నవారిలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ కావడానికి కరివేపాకు సహాయపడుతుంది. ఇందులోని గుణాలు రక్తంలో చక్కెర స్థాయిలను సులభంగా నియంత్రించి, శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను సమతుల్యం చేస్తాయి. డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
కరివేపాకులోని ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. దీంతో యాసిడిటీ, మలబద్ధకం, అజీర్తి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. రోజూ ఉదయం ఖాళీ కడుపుతో కరివేపాకు నమిలి తింటే కడుపు శుభ్రపడి, జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
45
జుట్టుకి మంచిది
కరివేపాకులోని బీటా కెరోటిన్, ప్రోటీన్ జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. దీంతో చుండ్రు సమస్యలు తగ్గి, ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.
గుండెకు మంచిది:
కరివేపాకులోని యాంటీఆక్సిడెంట్, యాంటీ అలెర్జీ గుణాలు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో బాగా సహాయపడతాయి. ఇవి శరీరంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించి, రక్తపోటును నియంత్రిస్తాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
55
ఎలా తినాలి?
రోజూ ఉదయం ఖాళీ కడుపుతో 5-7 కరివేపాకులు కడిగి బాగా నమిలి తినండి. లేదా కరివేపాకు రసం తాగండి. ఇలా క్రమం తప్పకుండా తింటే కొద్ది రోజుల్లోనే మంచి ఫలితాలు చూడచ్చు.