పనికి రావని బొప్పాయి గింజలను పారేస్తున్నారా? ఈ విషయం తెలిస్తే ఇకనుంచి ఆ పని అస్సలు చేయరు

Published : Sep 05, 2023, 01:16 PM IST

ఆరోగ్యంగా ఉండాలని పండ్లు, కూరగాయలను తింటుంటారు చాలా మంది. ఎందుకంటే వీటిలో మన శరీరానికి అవసరమైన పోషకాలన్నీ ఉంటాయి. ఇలాంటి పోషకాహారంలో బొప్పాయి ఒకటి. బొప్పాయి గుజ్జును తిని దాని గింజలను పారేస్తుంటారు. నిజానికి ఇవి కూడా మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. 

PREV
18
 పనికి రావని బొప్పాయి గింజలను పారేస్తున్నారా? ఈ విషయం తెలిస్తే ఇకనుంచి ఆ పని అస్సలు చేయరు
papaya seeds

బొప్పాయిలో న్యూట్రీషియన్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే దీన్ని సూపర్ ఫుడ్ అంటారు. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండటానికి రోజూ బొప్పాయి పండును తినడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే బొప్పాయిని తిని దాని గింజలను పారేసేవారు చాలా మందే ఉన్నారు. కానీ ఈ చిన్న నల్ల గింజల్లో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ విత్తనాల్లో అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలను తగ్గించే లక్షణాలు ఉన్నాయి. 

28

బొప్పాయి విత్తనాల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, విటమిన్లు, జింక్, భాస్వరం, కాల్షియం, మెగ్నీషియం వంటి అన్ని పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అంతే కాకుండా ఈ విత్తనాల్లో ఫైబర్ కంటెంట్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్దకం సమస్యను తగ్గించడానికి సహాయపడుతుంది. కాబట్టి బొప్పాయి గింజల వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

38
Papaya

చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రిస్తుంది

బొప్పాయి గింజల్లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని నార్మల్ చేయడానికి ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే ఒలేయిక్ యాసిడ్, మోనోశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఈ గింజల్లో ఉంటాయి. 
 

48
Papaya

గట్ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది

బొప్పాయి గింజల్లో కార్పేన్ కూడా ఉంటుంది. ఇది జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ ప్రేగు కదలిక ప్రక్రియను సులభతరం చేస్తుంది. ఈ చిన్న విత్తనాలలో పాపైన్, చైమోపాపైన్ వంటి ఎంజైమ్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియకు సహాయపడతాయి. అలాగే గ్యాస్, ఉబ్బరం లక్షణాలను కూడా తగ్గిస్తాయి.

58
Papaya

రోగనిరోధక వ్యవస్థకు మేలు చేస్తుంది

రోగనిరోధక శక్తిని బలంగా ఉంచే గుణాలు బొప్పాయి విత్తనాల్లో ఉంటాయి.  బొప్పాయి విత్తనాల్లో విటమిన్-సి కూడా తగిన మోతాదులో ఉంటుంది. ఈ విటమిన్ -సి మన శరీరాన్ని అనేక వ్యాధుల నుంచి కాపాడుతుంది.
 

68

యాంటీ క్యాన్సర్ గుణాలు

బొప్పాయి గింజల్లో యాంటీ క్యాన్సర్ గుణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ విత్తనాల్లో ఉండే  ఐసోథియోసైనేట్స్ వంటి సమ్మేళనాలు క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి.
 

78

చర్మం, జుట్టుకు ప్రయోజనకరంగా ఉంటుంది

బొప్పాయి గింజల్లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ సమస్యలను తగ్గిస్తాయి. ఈ విత్తనాలు జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడతాయి. మీరు చర్మం, జుట్టు కోసం బొప్పాయి విత్తన సారం లేదా నూనెను ఉపయోగించొచ్చు.

 

88
papaya

బొప్పాయి విత్తనాలను ఎలా తినాలి?

మీరు బొప్పాయి విత్తనాలను తినాలనుకుంటే వీటిని స్మూతీలు, రసాలు, ఓట్ మీల్ మొదలైన వాటితో కలిపి తినొచ్చు. లేదా మీరు ఈ విత్తనాలను ఉదయం ఒక గ్లాసు నీటితో కలిపి కూడా తినొచ్చు.
 

Read more Photos on
click me!

Recommended Stories