వాకింగ్ చేయడం వల్ల మానసిక స్థితిని మెరుగుపరిచే హార్మోన్లు విడుదలవుతాయి. శరీరంలో ఎండార్ఫిన్లు విడుదల కావడం వల్ల మానసిక స్థితి స్థిరంగా ఉండి, ఆందోళన తగ్గుతుంది. భోజనం తర్వాత కొద్దిసేపు నడిస్తే మానసిక ఒత్తిడి తగ్గుతుంది.
శక్తి స్థాయిలు పెరుగుతాయి:
భోజనం తర్వాత కొద్దిసేపు నడిస్తే శరీరమంతా రక్త ప్రసరణ, ఆక్సిజన్ మార్పిడిని ప్రోత్సహిస్తుంది. దీనివల్ల ఉత్సాహంగా, చురుగ్గా ఉంటారు. శరీర శక్తి స్థాయిలు పెరగడం వల్ల ఎక్కువ అప్రమత్తతతో పని చేయగలుగుతారు