చల్లని పాలా, వేడి పాలా? పిల్లలకి ఏ పాలు తాగిస్తే మంచిది?

Published : Jan 25, 2025, 01:15 PM IST

సాధారణంగా పిల్లల పెరుగుదలకు పాలు చాలా ముఖ్యం. చాలా మంది పిల్లలు పాలను ఇష్టంగా తాగుతూ ఉంటారు. ఒక్కోసారి కేవలం పాలు తాగే వారు రోజంతా ఆడుతూపాడుతూ గడిపేస్తూ ఉంటారు. కానీ పాలను పిల్లలు ఏ టైంలో తాగితే మంచిదో మీకు తెలుసా?

PREV
16
చల్లని పాలా, వేడి పాలా? పిల్లలకి ఏ పాలు తాగిస్తే మంచిది?

పిల్లల ఎదుగుదలలో పాలు, పాల ఉత్పత్తులు కీలకమైనవి. చిన్న పిల్లలకి పాలు తాగించడం ఎంత ముఖ్యమో.. అవి ఇచ్చే టైం కూడా అంతే ముఖ్యం. సాధారణంగా ఎక్కువమంది తల్లులు వారి పిల్లలకి ఉదయం, సాయంత్రం పాలు తాగిస్తూ ఉంటారు.

26
ఆరోగ్యానికి మేలు

పిల్లలు పాలు తాగడం వల్ల శారీరక, మానసిక పెరుగుదల బాగుంటుంది. పాలలో ప్రోటీన్, కాల్షియం, విటమిన్లు ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. 

కానీ నిపుణుల సూచన ప్రకారం, పిల్లలకి సరైన సమయంలో పాలు ఇస్తేనే వాళ్ళ పెరుగుదల వేగంగా ఉంటుందట. ఏ సమయంలో పిల్లలు పాలు తాగాలో ఇప్పుడు చూద్దాం.

36
ఉదయాన్నే...

ఉదయం పాలు తాగితే పిల్లలకి రోజంతా శక్తి వస్తుంది. కానీ ఖాళీ కడుపుతో పాలు తాగితే కొంతమంది పిల్లలకి గ్యాస్ట్రిక్ సమస్య, వాంతులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి టిఫిన్ తర్వాత పాలు తాగించడం మంచిది. ఇది వాళ్ళ మెదడు పనితీరుని మెరుగుపరుస్తుంది. స్కూల్ కి వెళ్లే ముందు ఒక గ్లాస్ పాలు ఇవ్వవచ్చు.

 

46
రాత్రి పాలు తాగితే...

రాత్రి వేడి పాలు తాగితే పిల్లలకి నిద్ర బాగా పడుతుంది. పాలలో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది పిల్లల మనసుని ప్రశాంతంగా ఉంచి.. మంచి నిద్రకి సాయపడుతుంది. రాత్రి పాలు తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. పడుకునే ముందు పాలు తాగితే కాల్షియం శోషణ బాగుంటుంది, ఎముకలు దృఢంగా అవుతాయి. కండరాలకి విశ్రాంతి దొరికి అలసట తగ్గుతుంది.

 

56
సరైన సమయం..

నిపుణుల ప్రకారం.. రాత్రి పాలు తాగడం మంచిది. దీనివల్ల శరీరంలో కాల్షియం శోషణ పెరుగుతుంది. ఉదయం కంటే రాత్రి పాలు తాగితే ఎక్కువ లాభాలున్నాయి. కానీ పిల్లలు రోజంతా ఆడుకుంటూ తిరుగుతుంటే, ఉదయం టిఫిన్ తో పాటు అరగ్లాసు లేదా ఒక గ్లాస్ పాలు ఇవ్వవచ్చు.
 

66
చల్లని పాలా, వేడి పాలా?

పిల్లలకి రాత్రి పాలు ఇస్తే కాస్త వేడి పాలు ఇవ్వాలి. ఉదయం స్మూతీ లేదా షేక్ చేసి ఇవ్వొచ్చు. పిల్లలకి గ్యాస్ట్రిక్, కడుపు ఉబ్బరం సమస్య ఉంటే, తిన్న తర్వాత అర గ్లాస్ చల్లని పాలు తాగించవచ్చు. ఇది గ్యాస్ట్రిక్ ని తగ్గించడానికి సహాయపడుతుంది.

 

click me!

Recommended Stories