కావలసిన పదార్థాలు: 250 గ్రాముల మెంతులు (Fenugreek), 100 గ్రాముల వాము (Bishopsweed), 50 గ్రాముల నల్ల జీలకర్ర (Black cumin). ముందుగా మెంతులు, వాము, నల్ల జీలకర్రలో రాళ్లు, మట్టి లేకుండా శుభ్రపరచుకోవాలి. ఈ మూడింటినీ వేరువేరుగా ఒక దాని తర్వాత ఒకటి పెనం పైన వేసి వేడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ మూడింటినీ కలిపి మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. ఇలా పొడి చేసుకున్న పౌడర్ ను గాలి దూరని గాజు సీసాలో ఉంచి నిల్వచేసుకోవాలి. ఈ పొడిని ఎప్పుడూ తాగాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.