Skin Care: పండ్లతో మెరిసిపోయే చర్మం.. ఈ చిట్కాలు పాటిస్తే అందమే అందం!

Published : Apr 29, 2022, 02:56 PM IST

Skin Care: వాతావరణంలోని మార్పుల కారణంగా చర్మం అనేక ఇబ్బందులకు గురవుతుంది. ఈ సమస్యలను తగ్గించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసిన తగిన ఫలితం ఉండదు.  

PREV
17
Skin Care: పండ్లతో మెరిసిపోయే చర్మం.. ఈ చిట్కాలు పాటిస్తే అందమే అందం!

చర్మ సౌందర్యం (Skin beauty) కోసం తాజా పండ్లను (Fresh fruits) ఉపయోగిస్తే చర్మానికి తగిన పోషణనందడంతో పాటు చర్మ సమస్యలన్నీ తగ్గిపోతాయి. కనుక ఏ విధంగా ఉపయోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
 

27

తాజా పండ్లలో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి ముఖంపై ఏర్పడ్డ మొటిమలు, మచ్చలు, వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తాయి. అలాగే పండ్లలో ఉండే విటమిన్ సి, ఇ, యాంటీ ఆక్సిడెంట్లు (Antioxidants) కొలాజిన్ (Collagen) ఉత్పత్తికి సహాయపడుతాయి. దీంతో చర్మ సమస్యలన్నీ తగ్గిపోయి చర్మం కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంటుంది. దీంతో చర్మానికి మంచి నిగారింపు అందుతుంది.
 

37

నారింజ రసం, తేనె, గుడ్డు తెల్లసొన: ఒక కప్పులో నాలుగు స్పూన్ ల నారింజ రసం (Orange juice), ఒక స్పూన్ తేనె (Honey), గుడ్డు తెల్లసొన (Egg white) వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ముఖానికి మాస్క్ లా అప్లై చేసుకోవాలి. అరగంట తరువాత నీటితో ముఖాన్ని శుభ్రపరచుకోవాలి. ఇలా తరచూ చేస్తే మొటిమలు మచ్చలు తగ్గడంతో పాటు చర్మ కణాలలో పేరుకుపోయిన మురికి తొలగిపోతుంది.
 

47

కివీ, అవకాడో, తేనె: ఒక కప్పులో ఒక టేబుల్ స్పూన్ అవకాడో గుజ్జు (Avocado pulp), ఒక టేబుల్ స్పూన్ కివీ గుజ్జు (Kiwi pulp), పావు స్పూన్ తేనె (Honey) వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసుకుని అరగంట తరువాత నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఇలా చేస్తే చర్మం లోపలి నుంచి శుభ్రపడి చర్మ సమస్యలు తగ్గుతాయి. దీంతో కాంతివంతమైన చర్మ సౌందర్యం మీ సొంతం.
 

57

నేరేడుకాయలు, తేనె: ఒక కప్పులో రెండు టేబుల్  స్పూన్ ల నేరేడుకాయల గుజ్జు (Apricot pulp), ఒక స్పూన్ తేనె (Honey) వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకొని ఇరవై నిమిషాల తరువాత ముఖాన్ని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా తరచూ చేస్తే చర్మకణాలలో పేరుకుపోయిన మృత కణాలు తొలగిపోతాయి. దీంతో చర్మం శుభ్రపడి ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే మెరిసే చర్మ సౌందర్యం మీ సొంతమౌతుంది.
 

67

చెర్రీస్, తేనె: ఒక కప్పులో చెర్రీస్ గుజ్జు (Cherries pulp), రెండు టేబుల్ స్పూన్ ల తేనె (Honey) వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని ఇరవై నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా తరచూ చేస్తే ముఖంపైన ఏర్పడ్డ డార్క్ స్పాట్స్  తొలగిపోతాయి. దీంతో చర్మానికి మంచి నిగారింపు అందుతుంది.
 

77

పుచ్చకాయ జ్యూస్: పుచ్చకాయ జ్యూస్ (Watermelon juice) లో ఉండే విటమిన్ సి చర్మ సమస్యలను తగ్గించి యవ్వనంగా కనిపించేందుకు సహాయపడుతుంది. కనుక పుచ్చకాయ జ్యూస్ ను కాసేపు ఫ్రిజ్ లో ఉంచి తరువాత తీసి కాటన్ బాల్స్ సహాయంతో ముఖానికి, మెడకు అప్లై చేసుకోవాలి. పదిహేను నిమిషాల తరువాత నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా తరచూ చేస్తే ముఖంపై ముడతలు (Wrinkles) తగ్గి యవ్వనంగా కనిపిస్తారు.

click me!

Recommended Stories