పసుపు
శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి పురాతన కాలం నుంచి పసుపును వాడుతున్నారు. పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇది జలుబు, దగ్గు, బ్రోన్కైటిస్, ఉబ్బసాన్ని తగ్గించడానికి ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇంట్లోనే పసుపు రెమెడీని తయారు చేసుకోవాలంటే ఒక టీస్పూన్ పసుపు పొడిని ఒక గ్లాసు గోరువెచ్చని పాలు లేదా నీటిలో కలిపి రోజుకు రెండుసార్లు తాగండి. దీనికి అల్లాన్ని కూడా కలపొచ్చు.