చెవి నొప్పిని తగ్గించే అద్భుతమైన చిట్కాలు.. ఒక్కసారి ట్రై చేసి చూడండి?

First Published Nov 16, 2021, 2:52 PM IST

చెవి నొప్పి (Ear pain) ఉన్నప్పుడు మనకు చాలా బాధ కలిగిస్తుంది. చెవి నొప్పి రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. చెవిలో ఇన్ఫెక్షన్ లు ఉన్నప్పుడు కూడా చెవి నొప్పి బాధిస్తుంది. జలుబు, గొంతు నొప్పి, దగ్గు ఎక్కువగా ఉన్నప్పుడు కూడా చెవి నొప్పికి దారి తీస్తుంది. చెవి క్లీన్ చేసుకోవడానికి చెవిలో ఏవిపడితే అవి పెట్టి తిప్ప రాదు. దీంతో చెవి నొప్పి సమస్యలు ఏర్పడతాయి. ఇప్పుడు ఈ ఆర్టికల్ (Article) ద్వారా చెవి నొప్పి నివారణకు తీసుకోవాల్సిన చిట్కాల గురించి తెలుసుకుందాం..
 

చెవి నొప్పి ఉన్నప్పుడు చికాకు (Irritation) ఏర్పడుతుంది. కూర్చుంటే నరకం, నుంచుంటే నరకం అన్నట్టుగా ఉంటుంది. ఏదైనా శబ్దం విన్న చికాకు, కోపం ఏర్పడతాయి. మొదట మనం నొప్పికి గల కారణాల గురించి తెలుసుకోవాలి. నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు తప్పిని సరిగా డాక్టర్ ను సంప్రదించాలి. చెవినొప్పి సహజంగా వచ్చినట్లైతే కొన్ని హోం రెమెడిసీ (Home remedy) ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. చెవి నొప్పి ఉన్నప్పుడు పాటించవలసిన కొన్ని నియమాలు, చిట్కాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
 

చెవి నొప్పి ఉన్నప్పుడు ఎటువంటి వస్తువులను చెవిలో పెట్టేసి తిప్పరాదు. ఇలా చేయడంతో ఇయర్ డ్రం (Ear drum) పాడవుతుంది. దాంతో చెవి సమస్యలు ఏర్పడతాయి. కాటన్ ఇయర్ బడ్స్ ను పెట్టి తిప్పకూడదు, అందువల్ల చెవిలో మరింత దుమ్ముచేరే అవకాశం ఉంది. చెవి నొప్పికి ముఖ్య కారణం జలుబు, దగ్గు కూడా కావచ్చు.
 

ముక్కు మూసుకుపోయి దాంతో పాటు చెవి నొప్పి ఉంటే దానికి కారణం జలుబు (Cold) కావచ్చు. మొదట ముక్కును క్లియర్ చేసుకుంటే, చెవునొప్పి అదంట అదే తగ్గుతుంది. అందుకు ఆవిరి పట్టడం చేయవచ్చు. వేడినీటిలో డిప్ చేసిన టవల్ తో నొప్పి ఉన్న ప్రదేశంలో కాపడం పెట్టాలి. దీంతో నొప్పి ఉన్న ప్రదేశంలో వెచ్చదనం తగిలి నొప్పి (Pain) నుంచి విముక్తి కలుగుతుంది.

ఇలా చేయడంతో జలుబు వల్ల వచ్చే నొప్పి నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. చెవి నొప్పి ఎక్కువ ఉన్నప్పుడు డాక్టర్ (ENT Specialist) దగ్గరకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడినప్పుడు ఐ బ్రూఫిన్ టాబ్లెట్స్ ను వేసుకోవచ్చు. ఈ మందులు 18 లోపు వయసున్న పిల్లలకు ఇవ్వరాదు. ఇటువంటి మెడిసిన్ ఇవ్వడానికి ముందు పీడియాట్రిషన్ ను సంప్రదించాలి.
 

చెవి నొప్పి తగ్గించడానికి ఆలివ్ ఆయిల్ (Olive oil) చక్కటి ఔషధంగా పనిచేస్తుంది. చెవి నొప్పి ఉన్నప్పుడు ఆలివ్ ఆయిల్ ను వేడిచేసి గోరు వెచ్చగా ఉన్నప్పుడు చెవిలోకి రెండు చుక్కలు వదలాలి. దీంతో నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. చెవి నొప్పి, వాపు మిమ్మల్ని బాధిస్తూ ఉంటే దీని నుండి ఉపశమనం కలగడానికి ఉల్లిపాయ (Onion) ఎంతగానో పనిచేస్తుంది. దీని కోసం ముందుగా ఒక ఉల్లిపాయను తీసుకొని కట్ చేసి పేస్ట్ చేసుకోవాలి.
 

ఈ పేస్ట్ ను వాపు ఉన్న ప్రదేశంలో రాయాలి. చెవిని (Ear) పట్టి లాగడం, అటు ఇటు చేత్తో కలపడం ద్వారా కొంచెం రిలీఫ్ అవుతుంది. పెద్దగా ఆవిలించడం విగ్లింగ్ చేయడం ద్వారా, చెవిరంద్రాల యొక్క ట్యూబ్స్ పెద్దగా తెరచుకుని లోపలికి గాలి చెరి రిలీఫ్ అందిస్తుంది. వ్యాధినిరోధకతను ఎదుర్కొనే విటమిన్ ఎ, సి, ఇ ఆహారాలను (Food) ఎక్కువగా తీసుకోవాలి.

click me!