మనల్ని ఆరోగ్యంగా ఉంచేందుకు సూర్యరశ్మి కూడా ఎంతగానో సహాయపడుతుంది. ఉదయం కాసేపు సూర్యరశ్మిలో ఉండటం వల్ల మన శరీరానికి అవసరమైన విటమిన్ డి అందుతుంది. అలాగే మన చర్మానికి కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అయితే సూర్యరశ్మిలో ఎక్కువ సేపు ఉంటే వడదెబ్బ, చర్మ క్యాన్సర్ వంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే చర్మ ఆరోగ్యానికి తగినంత సూర్యరశ్మి పొందడం చాలా అవసరమని పరిశోధకులు అంటున్నారు.
Image: Getty Images
సోరియాసిస్, తామర సమస్యలతో బాధపడుతున్న వారిపై పరిశోధకుల బృందం ఇటీవల ఒక అధ్యయనం నిర్వహించింది. ఈ అధ్యయనంలో పాల్గొనేవారిలో ఎక్కువ మందికి సోరియాసిస్, తామర లక్షణాలను తగ్గించడానికి సూర్యరశ్మి ఎంతో సహాయపడిందని కనుగొన్నారు. సూర్యరశ్మిలో ఉండే అతినీలలోహిత కిరణాల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయని కనుగొన్నారు.
ఈ చర్మ సమస్యల వల్ల వచ్చే దద్దుర్లు, ఎర్రబారడం, దురదను సూర్యకిరణాల్లో ఉంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు తగ్గిస్తాయని అధ్యయనంలో తేలింది" అని జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకుడు డాక్టర్ సంజీవ్ కుమార్ చెప్పారు.
చర్మ క్యాన్సర్, అకాల వృద్ధాప్యం ఉన్న సోరియాసిస్, తామరతో బాధపడుతున్న రోగులు సూర్యరశ్మికి ఉండకూడదని నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ సూర్యరశ్మి ఈ సమస్యలపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని, పేషెంట్ల జీవన నాణ్యతను మెరుగుపరుస్తుందని పరిశోధనలు సూచిస్తున్నాయి.
సూర్యరశ్మిలో ఉండటం వల్ల శరీరంలో విటమిన్ డి ఉత్పత్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. ఉదయపు సూర్యరశ్మి కూడా మంచి నిద్రను పొందడానికి సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. సూర్యరశ్మి మనల్ని రోజంతా తాజాగా, ఎనర్జిటిగ్ ఉంచడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.