sleeping
మన శరీరానికి నిద్ర చాలా అవసరం. అలసిన శరీరాన్ని తిరిగి రీఫ్రెష్ గా, ఎనర్జిటిక్ గా చేయడానికి నిద్ర సహాయపడుతుంది. అయితే చాలా మంది హాయిగా, ప్రశాంతంగా నిద్రపోవడానికి ఖచ్చితంగా తలకింద దిండు వేసుకుంటుంటారు. చాలా మందికి దిండులేనిదే నిద్రే రాదు. కానీ దిండు లేకుండా పడుకోవడమే మంచి అలవాటు అంటారు ఆరోగ్య నిపుణులు. అసలు దిండు లేకుండా పడుకుంటే మనకు కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
sleeping
వెన్నునొప్పిని తగ్గిస్తుంది
ఈ రోజుల్లో చాలా మందికి వెన్ను నొప్పి సమస్య ఉంది. ఈ వెన్ను నొప్పికి ఎన్నో కారణాలు ఉన్నాయి. కానీ ఇలాంటి వారు దిండును అస్సలు వేసుకోకూడదు. మీకు ఈ సమస్య ఉంటే గనుక దిండు లేకుండా పడుకోవడం అలవాటు చేుసుకోవాలి. ఎందుకంటే దిండు లేకుండా పడుకుంటే మీ వెన్నెముక నిటారుగా ఉంటుంది. దీంతో నొప్పి చాలా వరకు తగ్గుతుంది.
మెడ నొప్పిని తగ్గిస్తుంది
మెడనొప్పికి ఎన్నో కారణాలు ఉంటాయి. కానీ మెడ నొప్పితో బాధపడేవారు మాత్రం దిండును అస్సలు ఉపయోగించకూడదు. అవును మీరు దిండు లేకుండా పడుకుంటే నొప్పి చాలా వరు తగ్గుతుంది. మీరు దిండు లేకుండా నిద్రపోతే మీ మెడ, భుజాలకు రక్త ప్రవాహం సాఫీగా ఉంటుంది. దీంతో మెడనొప్పి తగ్గుతుంది.
చర్మం, జుట్టు
దిండు వేసుకుని పడుకోవడం వల్ల జుట్టు, చర్మం దెబ్బతింటాయి. మీకు తెలుసా? దిండు వేసుకుని పడుకునే వారికే జుట్టు, చర్మానికి సంబంధించిన సమస్యలు వస్తాయని పలు అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. ఎందుకంటే దిండుపై దుమ్ము, దూళి, చెమట బాగా ఉంటాయి. వీటివల్ల ముఖంపై మొటిమలు అవుతాయి. అలాగే జుట్టు రాలుతుంది. అందుకే మీరు గనుక దిండు లేకుండా పడుకోవడం అలవాటు చేసుకుంటే గనుక ఈ సమస్య నుంచి బయటపడతారు.
తలనొప్పిని తగ్గిస్తుంది
కొంతమందికి ఉదయం లేవగానే తలనొప్పి వస్తుంటుంది. దీనికి కారణం దిండేనంటారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే ఎత్తైన దిండుపై పడుకోవడం వల్ల తలకు రక్తప్రసరణ, ఆక్సిజన్ సరఫరాలు తగ్గుతాయి. దీనివల్లే పొద్దున్న నిద్రలేవగానే తలనొప్పి వస్తుంది. అందుకే ఇలాంటి సమస్య ఉన్నవారు దిండు లేకుండా పడుకోవడం అలవాటు చేసుకోవాలి.
శరీర భంగిమ మెరుగు
తలకింద దిండు పెట్టుకుని పడుకుంటే మీ మెడ ఎక్కువ సేపు వంగుతుంది. దీనివల్ల రానురాను మీ మెడ బాగా వంగుతుంది. కాబట్టి దిండు లేకుండా నిద్రపోవడం అలవాటు చేసుకోండి. ఇది మీ మెడను నిటారుగా ఉంచుతుంది.
మంచి నిద్ర
దిండు ఉంటేనే నిద్రపడుతుందని చాలా మంది అంటుంటారు. కానీ దిండు వల్ల లేనిపోని సమస్యలు వస్తాయి. దీనివల్ల మీకు సరిగ్గా నిద్రపట్టదు. కాబట్టి మీరు దిండు లేకుండా పడుకోవడం అలవాటు చేసుకోవాలి. మీకు తెలుసా? దిండు లేకుండా నిద్రపోవడం వల్ల మెదడుకు రక్త ప్రవాహం, ఆక్సిజన్ పెరుగుతుంది. దీంతో మీ ఒత్తిడి తగ్గుతుంది. అలాగే బాగా నిద్రపడుతుంది.