పసుపును ఒక్క వంటలకే కాదు పెళ్లిళ్లకు, శుభకార్యాలకు కూడా ఉపయోగిస్తారు. అంతేకాదు పసుపును పవిత్రంగా కూడా భావిస్తారు. పసుపును కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు అందానికి కూడా ఉపయోగించొచ్చు. పసుపును తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎన్నో వ్యాధులతో పోరాడే సామర్థ్యం అందుతుంది.
అంతేకాకుండా ఇది శరీరం మంటను తగ్గించడానికి సహాయపడుతుంది.పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. రోజూ పసుపును తీసుకోవడం వల్ల మనకు బోలెడు లాభాలు కలుగుతాయి.
మనలో ప్రతి ఒక్కరికీ పసుపు ప్రయోజనాల గురించి అంతో ఇంతో తెలిసే ఉంటుంది. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే? పసుపు కూడా హాని చేస్తుంది. అవును పసుపు కూడా మనల్ని కొన్ని జబ్బుల బారిన పడేస్తుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.