ముక్కులో ఆవ నూనె వేస్తే ఎంత మంచిదో తెలుసా?

Published : Jun 15, 2023, 04:26 PM IST

ఈ చిట్కాను ఎన్నో ఏండ్ల నుంచి పాటిస్తున్నారు. నిజానికి ఆవనూనెను ముక్కులో వేయడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి.   

PREV
17
 ముక్కులో ఆవ నూనె వేస్తే ఎంత మంచిదో తెలుసా?

ముక్కులో ఆవనూనె చుక్కలను వేయడం సాంప్రదాయ నివారణలలో ఒకటి. మూసుకుపోయిన ముక్కు రంధ్రాలు, జలుబును తగ్గించడానికి ఈ పద్దతిని పాటిస్తుంటారు. నిజానికి ఆవనూనెలో ఎన్నో ఔషదగుణాలు ఉంటాయి. ఈ నూనెలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ముక్కులో నూనె వేసే విషయానికి వస్తే.. ఆయుర్వేదం దీనిని న్యాస యోగ అని పిలుస్తోంది. ఇది ముక్కు లోపల నాసికా కుహరాలలో తేమను ఉత్పత్తి చేసి తల, ఊపిరితిత్తుల సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అసలు ముక్కులో నూనె వేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

27

ముక్కు పొడిబారడం

ముక్కు పొడిబారినప్పుడు.. ఆవనూనెను ముక్కులో వేసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. చాలాసార్లు డీహైడ్రేషన్ వల్లే ముక్కు లోపల పొడిబారుతుంది. అంతేకాదు రక్తస్రావం కూడా అవుతుంది.  ఇలాంటప్పుడు ఆవనూనెను ముక్కులో వేసుకోవడం వల్ల లూబ్రికేషన్ గా పనిచేసి ఈ సమస్యను తగ్గిస్తుంది.
 

37

జలుబు కోసం 

సాధారణ జలుబును తగ్గించుకోవడానికి కూడా ఆవ నూనె ఎన్నో విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. నిజానికి మీకు జలుబు ఉన్నప్పుడు మీ ముక్కులో ఆవ నూనెను వేయండి. ఇది శ్లేష్మాన్ని విచ్ఛిన్నం చేయడానికి, ముక్కు దిబ్బడను క్లియర్ చేయడానికి, బాగా శ్వాస తీసుకోవడానికి సహాయపడుతుంది.
 

47

అలెర్జీలకు 

ఆవ నూనెలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇలాంటి ఆవనూనె అలెర్జీని సులభంగా తగ్గిస్తుంది. ఈ ఆవనూనె తుమ్ముల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. 

57

మైగ్రేన్లకు

మైగ్రేన్లకు కూడా ఆవనూనె ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ నూనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి నాసికా మార్గం ద్వారా నేరుగా నెత్తిమీదకు చేరతాయి. ఇది నొప్పిని తగ్గిస్తుంది. 
 

67

సైనస్ కోసం 

ఆవనూనెను ముక్కులో వేయడం వల్ల సైనస్ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇది శ్లేష్మాన్ని సడలిస్తుంది. నాసికా మార్గాలను తెరుస్తుంది. 
 

77

ఆవ నూనెను ముక్కులో ఎలా వేయాలి?

ఆవ నూనెను ముక్కులో వేయడానికి ఉత్తమ మార్గం కొద్దిగా వేడి చేసి, కొద్దిగా చల్లారనివ్వండి. ఇది మీ చేతులతో తాకగలిగేంతగా ఉండాలి. ఆ తర్వాత ఒక కాటన్ బాల్ తీసుకుని నూనెలో ముంచి ముక్కులో పిండుకోవాలి. సుమారు 2 నుంచి 4 చుక్కల ఆవనూనెను ముక్కులో వేయాలి. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఈ పని చేయొచ్చు.
 

Read more Photos on
click me!

Recommended Stories