గ్యాస్, కడుపు నొప్పిని వెంటనే తగ్గించే చిట్కాలు మీకోసం..

Published : Jun 15, 2023, 01:08 PM IST

గ్యాస్ట్రిక్, కడుపు నొప్పి తెగ ఇబ్బంది పెడతాయి. అందుకే వీటిని వీలైనంత తొందరగా తగ్గించుకోవాలి. అయితే కొన్ని చిట్కాలు ఈ సమస్యను చాలా తొందరగా తగ్గిస్తాయి.  

PREV
19
గ్యాస్, కడుపు నొప్పిని వెంటనే తగ్గించే చిట్కాలు మీకోసం..

ఆయిలీ, జంక్ ఫుడ్ ను తినడం, చెడు జీవనశైలి వల్ల కడుపులో గ్యాస్ వస్తుంది. ఎంత చేసినా ఈ సమస్య తగ్గని సందర్భాలు కూడా ఉంటాయి. కానీ దీని వల్ల చంచలత, ఆందోళన, కడుపు నొప్పి, ఛాతీలో భారం వంటి సమస్యలు వస్తాయి. కడుపులో గ్యాస్ ను, కడుపు నొప్పిని తొందరగా ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

29

మల విసర్జన

పబ్మెడ్ సెంట్రల్ ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. మలవిసర్జన చేస్తే గ్యాస్ నుంచి ఉపశమనం లభిస్తుంది. సాధారణంగా మల విసర్జన ప్రేగులలో చిక్కుకున్న వాయువును సులభంగా తొలగిస్తుంది. మరుగుదొడ్డికి వెళ్లాల్సిన అవసరం లేకపోయినా బాత్రూంలోనే కూర్చోవాలి. దీనివల్ల గ్యాస్ బయటకు వస్తుంది.
 

39

నడవండి

మీ ప్రేగులలో వాయువు చిక్కుకుంటే కదలకుండా ఒకేదగ్గర కూర్చోకండి. నడవండి లేదా వ్యాయామం చేయండి. ఇలా చేయడం వల్ల మీ గ్యాస్ సులభంగా బయటకు వస్తుంది.
 

49

మసాజ్

గ్యాస్ సమస్య నుంచి బయటపడాలంటే మీ చేతులతో మీ కడుపును మసాజ్ చేయండి. చేతిని పై నుంచి కిందికి కదిలించండి. ఇది వాయువును శరీరం నుంచి కిందికి, బయటకు కదలడానికి సహాపడుతుంది. మసాజ్ చేయడానికి కొబ్బరి నూనె లేదా ఆవ నూనెను ఉపయోగించొచ్చు.
 

59

లవంగం నూనె

నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ప్రకారం.. లవంగం నూనె ఉబ్బరం, వాయువు, అజీర్ణంతో సహా జీర్ణ సమస్యలను తగ్గించడానికి ఉపయోగించబడింది. ఇది అల్సర్ ను తగ్గించే లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. ఇది నొప్పి నుంచి ఉపశమనం కలిగించడంలో కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది. భోజనం తర్వాత లవంగం నూనె తీసుకోవడం వల్ల జీర్ణ ఎంజైములు పెరుగుతాయి. అలాగే ప్రేగులలో వాయువు పరిమాణం తగ్గుతుంది.
 

69
Image: Getty


హీట్ ప్యాడ్ 

కడుపులో గ్యాస్ నొప్పి ఉంటే వేడినీటి బాటిల్ లేదా హీటింగ్ ప్యాడ్ ను పొట్టపై ఉంచండి. నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ప్రకారం.. వెచ్చదనం గట్ కండరాలను సడలిస్తుంది. పేగుల నుంచి వాయువు బయటకు రావడానికి సహాయపడుతుంది. వేడి నొప్పి ని కొద్దిగా తగ్గిస్తుంది కూడా. 

79

వాటర్, ఆపిల్ సైడర్ వెనిగర్ మిశ్రమం

ఆపిల్ సైడర్ వెనిగర్ కడుపు ఆమ్లం, జీర్ణ ఎంజైమ్ల ఉత్పత్తికి సహాయపడుతుంది. గ్యాస్ నొప్పి నుంచి తక్షణమే ఉపశమనం పొందడానికి కూడా ఇది సహాయపడుతుంది. దీంతోపాటుగా కడుపులో చిక్కుకున్న గ్యాస్ బయటకు రావడం సులువవుతుంది. పబ్ మెడ్ సెంట్రల్ ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. భోజనానికి ముందు ఒక గ్లాసు నీటిలో ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ ను మిక్స్ చేసి తాగడం వల్ల గ్యాస్ నొప్పి, కడుపు ఉబ్బరం తగ్గుతాయి. దీని తర్వాత నోటిని నీటితో కడగాలి. ఎందుకంటే వెనిగర్ పంటి ఎనామెల్ ను నాశనం చేస్తుంది.
 

89

బేకింగ్ సోడా 

పబ్ మెడ్ సెంట్రల్ ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. ఒక గ్లాసు నీటిలో 1/2 టీస్పూన్ సోడియం బైకార్బోనేట్ (బేకింగ్ సోడా) మిక్స్ చేసి తాగండి. 1/2 టీస్పూన్ కంటే ఎక్కువ బేకింగ్ సోడాను ఉపయోగించకండి. కడుపు నిండినప్పుడు బేకింగ్ సోడాను ఎక్కువగా తీసుకోకకూడదు. 
 

99
gas problem

గ్యాస్ సమస్య రావొద్దంటే..

హైడ్రేట్ గా ఉండండి
కార్బోనేటేడ్ పానీయాలను తాగకండి. 
నీరు ఉష్ణోగ్రత గది ఉష్ణోగ్రతతో సమానంగా ఉన్నప్పుడు మాత్రమే తాగండి. 
వాయువును ఎక్కువగా ఉత్పత్తి చేసే ఆహారాలకు మాత్రమే దూరంగా ఉండండి.
కృత్రిమ స్వీటెనర్లకు దూరంగా ఉండండి.
నెమ్మదిగా తినండి. బాగా నమలండి.
స్మోకింగ్ చేయకండి. పొగాకుకు కూడా దూరంగా ఉండండి.
చూయింగ్ గమ్ నమలొద్దు.
శారీరకంగా చురుకుగా ఉండటానికి ప్రయత్నించండి.
 

Read more Photos on
click me!

Recommended Stories