ఉదయాన్నే అంజీర వాటర్ ను తాగితే ఏమౌతుందో తెలుసా?

First Published | Sep 24, 2024, 10:59 AM IST

అంజీర పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ డ్రై ఫ్రూట్ ను తింటే మీరు ఎన్నో రోగాలకు దూరంగా ఉంటారు. అయితే ఈ పండును రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే దాన్ని తిని ఆ వాటర్ ను తాగితే మీ శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటంటే?
 

fig water

అంజీర పండ్లలో మన ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ డ్రై ఫ్ఱూట్ లో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ కె, విటమిన్ ఇ,  ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్ తో పాటుగా ఎన్నో రకాల పోషకాలుంటాయి. డ్రై అంజీర పండ్లను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తింటే మీరు బోలెడు లాభాలను పొందుతారు. 

fig water

నానబెట్టిన అంజీర పండ్లే కాదు దాని వాటర్ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మీరు ఉదయాన్నే అంజీర వాటర్ ను తాగితే గుండె ఆరోగ్యంగా ఉండటం నుంచి బీపీ తగ్గడం వరకు ఎన్నో ప్రయోజనాలను పొందుతాం. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

Latest Videos


బలమైన జీర్ణవ్యవస్థ 

మన జీర్ణవ్యవస్థ  ఆరోగ్యంగా ఉంటేనే  మన శరీరం అన్ని విధాలా ఆరోగ్యంగా ఉంటుంది. అయితే మీ జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా, బలంగా ఉండటానికి ఉదయాన్నే పరిగడుపున అంజీర వాటర్ ను తాగడం అలవాటు చేసుకోండి. నిజానికి అంజీర పండ్లలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరచడానికి బాగా సహాయపడుతుంది. ఈ వాటర్ ను తాగితే మలబద్ధకం వంటి జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. 

శక్తి వనరు

అంజీర పండ్లు సహజ చక్కెరకు మంచి మూలం. నానబెట్టిన అత్తి పండ్లను మీరు ఉదయాన్నే పరిగడుపున తింటే మీ శరీరానికి మంచి శక్తి అందుతుంది. ఇది మిమ్మల్ని రోజంతా ఎనర్జిటిక్ గా ఉంచుతుంది. మీ శరీరానికి కావాల్సిన బలాన్ని అందిస్తుంది.

figs

రక్తపోటును నియంత్రిస్తుంది

అధిక రక్తపోటు ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఇది గుండెపోటుకు దారితీస్తుంది. అయితే మీరు ఉదయాన్నే పరిగడుపున అంజీర నీళ్లను తాగితే అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. దీంతో మీ ఆరోగ్యంగా ఉంటుంది. ఈ వాటర్ ను తాగితే హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. 

బరువు నియంత్రణ

అంజీర పండ్ల వాటర్ మీ బరువును తగ్గించడానికి కూడా బాగా సహాయపడతాయి. ఈ అంజీర వాటర్ లో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ వాటర్ ను తాగితే మీ ఆకలి కూడా కంట్రోల్ లో ఉంటుంది. దీంతో మీరు అతిగా తినకుండా ఉంటారు. సులువుగా బరువు తగ్గుతారు. 

figs

చర్మానికి మేలు 

అంజీర వాటర్ లో ఎన్నో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చే ముఖంపై ముడతలను, నల్ల మచ్చలను తగ్గిస్తుంది. దీంతో పాటుగా ఎన్నో చర్మ సమస్యలను కూడా తగ్గించడానికి ఇది ఎంతగానో సహాయపడతుంది. 

బలమైన రోగనిరోధక వ్యవస్థ

అంజీర వాటర్ లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ శరీరం ఫ్రీ రాడికల్స్ తో పోరాడటానికి ఎంతగానో సహాయపడుతుంది. ఈ వాటర్ మీ ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి బాగా సహాయపడుతుంది. దీంతో మీరు ఎన్నో అంటువ్యాధులు, రోగాలకు దూరంగా ఉంటారు. 

dried figs


గుండెకు మేలు 

అంజీర పండ్లు గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడతాయి. ఈ పండ్లలో పొటాషియం కంటెంట్ మెండుగా ఉంటుంది. ఇది హైబీపీని నియంత్రించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అలాగే మీకు గుండె జబ్బులొచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. 

ఎముకల బలం

అంజీర వాటర్ ను పరిగడుపున తాగితే మీ ఎముకలు బలంగా ఉంటాయి. ఈ వాటర్ లో కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ ఎముకలను బలంగా ఉంచడానికి బాగా సహాయపడతాయి. ఈ వాటర్ ను రెగ్యులర్ గా తాగితే బోలు ఎముకల వ్యాధి వంటి ఎముకలకు సంబంధించిన వ్యాధులు వచ్చే రిస్క్ తగ్గుతుంది. 

click me!