ఓట్స్ ను చాలా మంది ఇష్టంగా తింటుంటారు. ఓట్స్ మంచి పోషకాహారం. కానీ చాలా మందికి దీని ఆరోగ్య ప్రయోజనాల గురించి అస్సలు తెలియదు. ఓట్స్ లో ఫైబర్, విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు దీనిలో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. దీనిలో ఉండే ఫైబర్ కంటెంట్ అతిగా తినడాన్ని తగ్గిస్తుంది.