పిల్లలకు రోజుకో గుడ్డును ఇందుకే ఇవ్వాలి

Published : Jul 31, 2023, 07:15 AM IST

పిల్లలకు మంచి పోషకాహారం చాలా అవసరం. వీటితోనే మీ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. వారి తెలివి తేటలు కూడా మెరుగ్గా ఉంటాయి. పిల్లలకు రోజూ ఇవ్వాల్సిన ఆహారాల్లో గుడ్లు ఒకటి. కోడి గుడ్లతో పాటుగా బాతు, కౌజు పిట్ట గుడ్లు కూడా పిల్లలకు మంచి మేలు చేస్తాయంటున్నారు నిపుణులు.   

PREV
16
పిల్లలకు రోజుకో గుడ్డును ఇందుకే ఇవ్వాలి

గుడ్లు ఎన్నో పోషకాలను కలిగి ఉన్న హెల్తీ ఫుడ్. గుడ్లలో ప్రోటీన్లు, ఇనుము, విటమిన్లు, మంచి కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. గుడ్లను తింటే మన శరీరంలో ఎన్నో పోషకాల లోపాలు పోతాయి. పిల్లలతో పాటుగా పెద్దలు కూడా గుడ్లను రెగ్యులర్ గా తినొచ్చు. ముఖ్యంగా పిల్లలకు రోజుకో గుడ్డును పెట్టాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

26

గుడ్డులోని తెల్లసొనను పది నెలల వయసు నుంచే పిల్లలకు పెట్టొచ్చు. అయితే మీ పిల్లలకు  ప్రోటీన్ అలెర్జీ లేకపోతే మాత్రమే దీన్ని పెట్టాలి. స్కూల్ కు వెళ్లే పిల్లలకు రోజుకో గుడ్డును పెట్టాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి.. గుడ్డును ఉడికించి మాత్రమే పెట్టాలి. 
 

36

ఒక మీడియం సైజ్ గుడ్డులో సుమారు 80–85 కేలరీలు, 6.6 గ్రాముల ప్రోటీన్, 7 గ్రాముల కొవ్వు, 213 కొలెస్ట్రాల్ ఉంటుంది. మన శరీరానికి అవసరమైన 24 ముఖ్యమైన అమైనో ఆమ్లాలు కూడా గుడ్డులో పుష్కలంగా ఉంటాయి. ఆహారం నుంచి లభించే 9 అమైనో ఆమ్లాలను కలిగి ఉన్న ఏకైక ఆహారం గుడ్లే.

46

సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం.. యు.ఎస్ లో 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న పిల్లల్లో సుమారు 6.8% మందికి దృష్టి సమస్యలు ఉన్నాయి. గుడ్లు లుటిన్, జియాక్సంతిన్ కు అద్భుతమైన వనరు. ఇవి కళ్లను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి.
 

56

ఆరోగ్యకరమైన కళ్లకు అవసరం.

గుడ్లలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన కొవ్వులు. ఇవి చేపలలో ఎక్కువగా కనిపిస్తాయి. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలుల మెదడు పెరుగుదలకు, తెలివితేటలు పెరగడానికి సహాయపడుతుంది. గుడ్లు విటమిన్ డి కి కూడా అద్భుతమైన మూలం. పిల్లల ఎముకల ఆరోగ్యానికి విటమిన్ డి చాలా అవసరం. గుడ్లలో అవసరమైన అమైనో ఆమ్లాలు  పుష్కలంగా ఉంటాయి. ఇది ఆరోగ్యకరమైన గోర్లు, జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. గుడ్లలో సంతృప్త, అసంతృప్త కొవ్వులు కూడా పుష్కలంగా ఉంటాయి. 

66

గుడ్లను తినడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. గుడ్లు విటమిన్ బి 12 కి అద్భుతమైన మూలం. నాడీ వ్యవస్థ ఆరోగ్యానికి విటమిన్ బి 12 చాలా చాలా అవసరం. ఈ విటమిన్ ను కోబాలమిన్ అని కూడా అంటారు. ఇది పిల్లల మెదడు, నాడీ వ్యవస్థ అభివృద్ధికి చాలా అవసరం.
 

Read more Photos on
click me!

Recommended Stories