ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో గుడ్డును తింటున్నారా?

Published : Jun 19, 2023, 07:15 AM IST

గుడ్డు సంపూర్ణ ఆహారం. రోజూ ఒక గుడ్డును తింటే ఎన్నో రోగాల ముప్పు తప్పుతుంది. గుడ్డులోని పచ్చ సొనలో ఉండే లుటిన్, జియాక్సంతిన్ లు  కళ్లలో కంటి శుక్లం, మాక్యులర్ క్షీణత ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. 

PREV
16
ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో గుడ్డును తింటున్నారా?
Image: Getty

మనలో చాలా మందికి గుడ్డంటే చాలా ఇష్టం ఉంటుంది. నిజానికి గుడ్డు టేస్టీగా ఉండటమే కాదు ఇది మన ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. గుడ్లు చాలా పోషకాలను కలిగి ఉన్న ఆరోగ్యకరమైన ఆహారం. ఒక గుడ్డులో సుమారు 7 గ్రాముల ఎక్కువ-నాణ్యత ప్రోటీన్, 5 గ్రాముల మంచి కొవ్వు, ఖనిజాలు, విటమిన్లు, ఇనుము వంటి ఎన్నో సూక్ష్మపోషకాలు పుష్కలంగా ఉంటాయి.
 

26
Image: Getty

గుడ్లను తినడం వల్ల మన శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీంతో చెడు కొలెస్ట్రాల్ కరగడం మొదలవుతుంది. చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోయిన వారికి గుండె జబ్బులు, స్ట్రోక్, ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. రోజుకు రెండు గుడ్లు తినడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు 10 శాతం పెరుగుతాయని తాజా అధ్యయనంలో తేలింది.
 

36

గుడ్డు పచ్చసొనలో ఎక్కువ మొత్తంలో లుటిన్, జియాక్సంతిన్ లు ఉంటాయి. ఇవి కళ్ళలో కంటిశుక్లం, మాక్యులర్ క్షీణత ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతాయి. గుడ్లలో విటమిన్ ఎ కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. గుడ్లలో విటమిన్ డి కూడా పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు దీనిలో ఫాస్పరస్ కూడా ఉంటుంది. ఇవి ఎముకలను, దంతాలను బలంగా ఉంచడానికి సహాయపడతాయి. 
 

46
egg

గుడ్లలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు కూడా ఉంటాయి. ఇవి రక్తంలో ఒక రకమైన లిపిడ్ కొవ్వు అయిన ట్రైగ్లిజరైడ్లను తగ్గించడానికి సహాయపడుతుంది. గుడ్లలో బీటైన్, కోలిన్ వంటి గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహించే ఎన్నో పోషకాలు ఉంటాయి. రోజుకు ఖచ్చితంగా ఒక గుడ్డును తినడం వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్ రిస్క్ తగ్గుతుందని తాజా అధ్యయనంలో తేలింది.

56

మన ఆహారంలో తగినంత ప్రోటీన్ ఉంటే మన శరీరం ఎన్నో రోగాల నుంచి తప్పించుకుంటుంది. అలాగే హెల్తీగా కూడా ఉంటుంది. ప్రతి గుడ్డులో ఆరు గ్రాముల ప్రోటీన్, అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి.
 

66

రోజుకు సరిపడా ప్రోటీన్ ను తీసుకుంటే మీ బరువు నియంత్రణలో ఉంటుంది. అలాగే మీ కండరాల పరిమాణం కూడా పెరుగుతుంది. అధిక రక్తపోటును నియంత్రణలో ఉంటుంది. ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. బోలు ఎముకల వ్యాధి ప్రమాదం తగ్గుతుంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం.. రోజుకు ఒక గుడ్డు తినడం మొత్తం ఆరోగ్యానికి మంచిది.
 

Read more Photos on
click me!

Recommended Stories