దోసకాయ ఫైబర్ కు మంచి మూలం. దీలోని అధిక నీటి శాతం జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. కీరదోసకాయలో ఉండే ఫైబర్స్ జీర్ణాశయం గుండా ఆహారం త్వరగా వెళ్లడానికి సహాయపడుతుంది. జీర్ణ సమస్యలు, గుండెల్లో మంట, అసిడిటీ, అల్సర్లు, మలబద్ధకం నివారించడానికి కీరదోసకాయ సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ సీజన్ ఈ కూరగాయను రోజూ తింటే మీ ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది.
డయాబెటిస్ ఉన్నవారు కీరదోసకాయను ఆహారంలో తప్పకుండా చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇవి బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేయడానికి ఎంతగానో సహాయపడుతాయి.