పండ్లను తింటూ కూడా బరువు తగ్గొచ్చు.. ఏయే పండ్లను తినాలంటే?

Published : Apr 16, 2023, 01:42 PM IST

బరువు తగ్గాలనుకునే చాలా మంది ముందు చేసే పని ఫుడ్ ను తగ్గించడం.  అయితే బరువు తగ్గాలని మొత్తమే తినడం మానేస్తే శరీరంలో పోషకాల లోపం ఏర్పడి ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.   

PREV
16
పండ్లను తింటూ కూడా బరువు తగ్గొచ్చు.. ఏయే పండ్లను తినాలంటే?
fruits

బరువు తగ్గాలనుకునే ప్రతి ఒక్కరూ వ్యాయామానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. కానీ కొన్ని రకాల ఆహారాలను తింటూ కూడా బరువు తగ్గొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బరువు తగ్గేందుకు కొన్ని రకాల పండ్లు ఎంతగానో సహాయపడతాయి. ఎలా అంటే పండ్లలో పోషకాలు, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మీరు ఆరోగ్యంగా బరువు తగ్గేలా చేస్తాయి. వీటిలో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. వెయిట్ లాస్ అయ్యేందుకు ఏయే పండ్లను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..

26
Photo Courtesy: Getty

పుచ్చకాయ

మీరు బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నట్టైతే పుచ్చకాయను ఖచ్చితంగా తినండి. ఈ సీజన్ లో పుచ్చకాయలు పుష్కలంగా లభిస్తాయి. పుచ్చకాయలో 90 శాతం నీరు ఉంటుంది. 100 గ్రాముల పుచ్చకాయలో కేవలం 30 కేలరీలు మాత్రమే ఉంటాయి.  పుచ్చకాయలో అర్జినిన్ అనే అమైనో ఆమ్లం కూడా ఉంటుంది. ఇది కొవ్వును ఫాస్ట్ గా తగ్గించడానికి సహాయపడుతుందని తేలింది. 
 

36
orange

నారింజ

విటమిన్ సి పుష్కలంగా ఉండే నారింజ రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. నారింజలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఈ పండులో పొటాషియం, ఖనిజాలు, ఫోలేట్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఈ పండును తింటే కూడా మీరు వేగంగా బరువు తగ్గుతారు. 
 

46
pineapple

అనాస పండు

అనాసపండులో వాటర్ కంటెంట్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి పైనాపిల్ బరువు తగ్గడానికి అద్భుతంగా పనిచేస్తుంది. పైనాపిల్ కూడా మెగ్నీషియానికి మంచి మూలం. ఇది ఎముకలను బలోపేతం చేయడానికి కూడా సహాయపడుతుంది.

56
Image: Getty Images

జామకాయ

జామ కాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ పండు ప్రోటీన్ కు, ఫైబర్ కు గొప్ప మూలం. ఇది కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచి స్థూలకాయాన్ని నివారించడానికి సహాయపడుతుంది. పూర్తిగా పండిన జామకాయలో కూడా షుగర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది.
 

66
Image: Getty Images

మామిడి పండ్లు

మామిడి పండ్లకు ఎండాకాలంలో కొదవే ఉండదు. ఈ పండులో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. బరువు తగ్గడానికి మామిడి పండ్లను పంచదార కలపకుండా జ్యూస్ గా లేదా ఇతర పద్దతుల్లో తినొచ్చు. 

click me!

Recommended Stories