వీటిని తింటే కళ్లు బాగా కనిపిస్తాయి..

Published : Apr 16, 2023, 12:34 PM IST

కంటిచూపును పెంచడానికి కొన్ని పోషకాలు అవసరం. అయితే కళ్లను ఆరోగ్యంగా ఉంచే, కంటిచూపును పెంచే పోషకాలు కొన్ని ఆహారాల్లో పుష్కలంగా ఉంటాయి. అవేంటంటే..   

PREV
16
వీటిని తింటే కళ్లు బాగా కనిపిస్తాయి..

ఫోన్లు, టీవీలను, ల్యాప్ టాప్ లను ఎక్కువ సేపు చూడటం, కంటినిండా నిద్రలేకపోవడం, ఒత్తిడి, వృద్ధాప్యం వంటి కారణాల వల్ల కంటి ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాగే కళ్లు కూడా సరిగ్గా కనిపించవు. పేలవమైన ఆహారమే వృద్ధాప్యంలో కంటిచూపును దెబ్బతీస్తుందని నిపుణులు చెబుతున్నారు. కంటి ఆరోగ్యం దెబ్బతింటే ఎన్నో కంటి సమస్యలు వస్తాయి. అయితే కొన్ని రకాల ఆహారాలను తింటే కంటిచూపు మెరుగుపడటంతో పాటుగా కళ్లు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. ఇందుకోసం ఎలాంటి ఆహారాలను తినాలంటే.. 
 

26
Image: Getty

చేపలు

చేపలు కూడా కంటిచూపును మెరుగుపర్చడానికి, కళ్లను  ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతగానో సహాయపడతాయి. సాల్మన్ వంటి చేపల్లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. వీటిని తింటే కళ్లు పొడిబారే అవకాశం తగ్గుతుంది. అలాగే రెటీనా ఆరోగ్యంగా ఉంటుంది. 

36

బాదం

బాదం మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తుంది. బాదం పప్పుల్లో ఉండే విటమిన్ ఇ కళ్లను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది. విటమిన్ ఇ ని పుష్కలంగా తీసుకుంటే మీ కంటిచూపు మెరుగ్గా ఉంటుంది. కంటి సమస్యలొచ్చే అవకాశమే ఉండదు. ఇది కంటిశుక్లం, మాక్యులర్ క్షీణత ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగని బాదం పప్పులను ఎక్కువగా తినకూడదు. 
 

46

గుడ్లు

గుడ్లు సంపూర్ణ ఆహారం.  దీనిలో మన శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో పుష్కలంగా ఉండే విటమిన్ ఎ, జింక్, జియాక్సంతిన్, లుటిన్ లు మన కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. గుడ్లలో ఉండే విటమిన్ ఎ కంటిలోని కార్నియాను రక్షిస్తుంది. ఇక కంటి సమస్యలొచ్చే ప్రమాదాన్ని జియాక్సంతిన్, లుటిన్ లు తగ్గిస్తాయి. కంటిచూపును మెరుగుపర్చడానికి జింక్ సహాయపడుతుంది. 
 

56

క్యారెట్లు

క్యారెట్లు కూడా మన ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిని తింటే మీ కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. క్యారెట్లలో బీటా కెరోటిన్, విటమిన్ ఎలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటిని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ రెండు పోషకాలు కంటి ఇన్ఫెక్షన్లను, ఇతర కంటి సమస్యలను నివారిస్తాయి.

66
Kale f

కాలె

ఈ ఆకుపచ్చని కూరగాయలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే కంటిని ఆరోగ్యంగా ఉంచే జియాక్సంతిన్, లుటిన్ లు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఆరోగ్య సంస్థల ప్రకారం.. కళ్లను కాపాడే జియాక్సంతిన్, లుటిన్ లను మన శరీరం తయారుచేయదు. వీటిని ఆహారం ద్వారే పొందాలి. ఒకవేళ కాలె అందుబాటులో లేకుంటే బచ్చలికూరను తినండి. 
 

click me!

Recommended Stories