మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అధిక కొవ్వు ఆహారం, వ్యాయామం లేకపోవడం, స్మోకింగ్, మందును ఎక్కవ తాగడం ఇవన్నీ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది. ముఖ్యంగా గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడానికి మీరు తినే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిపుణులు చెబుతున్నారు. రెడ్ మీట్, కొవ్వులు, స్వీట్లు, నూనెలు ఎక్కువగా ఉండే ఆహారాలను తినడం మానేస్తే చెడు కొలెస్ట్రాల్ పెరగడం తగ్గుతుంది. వీటిని తినడం మానేస్తే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అయితే కొన్ని పానీయాలు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడతాయి. అవేంటంటే..