మద్యం విపరీతంగా తాగుతున్నారా.. మీ చర్మం ఎలా మారుతుందో తెలుసా...?

First Published Nov 14, 2021, 1:23 PM IST

ఇక కొందరిలో చర్మం నిర్జీవంగా మారిపోతుంది. చర్మం దాని సజీవ స్వాభావాన్ని, ప్రకాశాన్ని కోల్పోతుంది. స్కిన్ టోన్ లో జీవం కోల్పోతుంది. చర్మ ఛాయను తగ్గిస్తుంది.

మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఈ విషయం మనకు తెలుసు. అయినా.. తాగకుండా ఉండలేరు. అయితే.. మీరు ఎంతలా తాగుతున్నారనే విషయం.. కేవలం మీ  చర్మం చూసి చెప్పేయవచ్చట. మద్యం కారణంగా..చర్మం మృదుత్వం కోల్పోతుందట.
 

వైన్, విస్కీ, బీర్, వోడ్కా, టేకిలా మొదలైనవి - ఒక్కోసారి కొన్ని పానీయాలను ఆస్వాదించే వారు తరచుగా డీహైడ్రేషన్‌తో బాధపడతారు. అయినప్పటికీ, ఆల్కహాల్ వారి శరీరాన్ని అనేక విధాలుగా ఎలా గందరగోళానికి గురి చేస్తుంది. ఈ విషయాన్ని వారు గ్రహించేలోగా.. జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.  ఊబకాయం ప్రమాదాన్ని పెంచడం నుండి గుండె , కాలేయ ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే వరకు వివిధ రకాల సమస్యలను తీసుకువస్తుంది. కొన్ని లక్షణాలను కేవలం మన చర్మం చూసి చెప్పేయవచ్చు.

చర్మం ఎర్రగా మారడం.. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునేవారి చర్మం ఎర్రగా మారుతుందట.  దీని వల్ల.. చర్మం సున్నితత్వం కోల్పోయి.. మంట పుట్టడం జరుగుతుందట. ఆల్కహాల్ చర్మం  ఉపరితలం క్రింద రక్త నాళాలను విస్తరిస్తుంది, మరింత రక్త ప్రవాహాన్ని ప్రోత్సహిస్తుంది. దీంతో.. చర్మం  ఎర్రగా మారుతుంది. ఆ తర్వాత ముఖం పై మొటిమలు రావడం కూడా మొదలౌతాయట.
 

డల్ స్కిన్.. ఇక కొందరిలో చర్మం నిర్జీవంగా మారిపోతుంది. చర్మం దాని సజీవ స్వాభావాన్ని, ప్రకాశాన్ని కోల్పోతుంది. స్కిన్ టోన్ లో జీవం కోల్పోతుంది. చర్మ ఛాయను తగ్గిస్తుంది.

skin care

బ్లాక్ హెడ్స్ , వైట్ హెడ్స్: చాలా బ్లాక్ హెడ్స్ , వైట్ హెడ్స్ అధికంగా ఆల్కహాల్ తీసుకోవడాన్ని సూచిస్తాయి. ఆల్కహాల్ కారణంగా చర్మం డీ హైడ్రేట్ అవుతుంది.   ఇది చర్మాన్ని పొడిగా చేస్తుంది .  దీంతో.. చర్మం తేమ కోసం ఆరాటపడుతుంది. నిర్జలీకరణం రంధ్రాలను మరింత విస్తరిస్తుంది. దీంతో బ్లాక్ హెడ్స్ , వైట్ హెడ్స్ ను పెంచుతుంది. ఇది కూడా మొటిమలను ప్రేరేపిస్తుంది.

ముడతలు ప్రారంభం: ఆల్కహాల్  విపరీతంగా తాగడం వల్ల చర్మం  వృద్ధాప్యానికి కారణమవుతుంది. ఆల్కహాల్-లింక్డ్ డీహైడ్రేషన్ వల్ల ముఖంపై గీతలు, ముడతలు రావడం మొదలౌతాయి. మద్యం తీసుకునే మోతాదును పట్టి.. వృద్ధాప్యం వచ్చేస్తూ ఉంటుంది.

click me!