తీయగా, టేస్టీగా ఉండే ఖర్జూరాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. నిజానికి ఖర్జూరాల్లో ఎన్నో పోషక విలువలు దాగున్నాయి. అందుకే ఖర్జూరాలను ప్రపంచవ్యాప్తంగా తింటున్నారు. ప్రతిరోజూ ఖర్జూరాలను తింటే ఆరోగ్యానికి ఎంత మంచి జరుగుతుందో తెలుసా?
ఖర్జూరాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఎన్నో వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. దీనిలో ఉండే కెరోటినాయిడ్స్ అని పిలువబడే యాంటీ ఆక్సిడెంట్లు మీ కణాలను ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడతాయి. అలాగే మీ గుండె ఆరోగ్యానికి మంచి మేలు చేస్తాయి. ఈ పండు కంటి సంబంధిత సమస్యల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
27
dates
క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఖర్జూరాల్లో ఉండే ఫినోలిక్ యాసిడ్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. అలాగే ఈ పండు కొన్ని ప్రాణాంతక క్యాన్సర్ల ప్రమాదాన్ని, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
37
dates
ఎముకలను బలపరుస్తుంది
ఖర్జూరాల్లో రాగి, సెలీనియం, మెగ్నీషియం లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా ఉంచడానికి, ఎముకల వ్యాధులను నివారించడానికి ఎంతగానో సహాయపడతాయి. అలాగే దీనిలో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకల జీవక్రియను సులభతరం చేస్తుంది. అలాగే రక్తం గడ్డకట్టడాన్ని నియంత్రిస్తుంది.
47
dates
కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది
ఖర్జూరాలను రోజూ తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇవి శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ను వేగంగా తగ్గిస్తాయి. బరువు తగ్గడంలో సహాయపడతాయి.
57
dates
మధుమేహానికి చెక్ పెడుతుంది
ఒక పరిశోధన ప్రకారం.. ఖర్జూరాలు రక్తంలో చక్కెర, కొవ్వు స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి. ఇన్సులిన్ ఉత్పత్తి, పేగు నుంచి గ్లూకోజ్ శోషించబడే రేటు రెండూ దాని ద్వారా మందగించబడతాయి. దీనివల్ల మధుమేహం వచ్చే అవకాశం తగ్గుతుంది.
67
బరువు తగ్గడానికి సహాయపడుతుంది
ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఖర్జూరం తినడం వల్ల మీ బరువు ఆరోగ్యంగా ఉంటుంది. దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది పెద్ద ప్రేగులలో పోషకాల శోషణను తగ్గిస్తుంది. అంతేకాదు ఖర్జూరాలు షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఉత్పత్తిని తగ్గించి జీవక్రియను పెంచుతాయి.
77
dates
ఐరన్ లోపాన్ని పోగొడుతుంది
మగవారి కంటే ఆడవాళ్ల శరీరంలోనే ఐరన్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. దీనివల్లే వీరికి రక్తహీనత సమస్య ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మీకు ఐరన్ లోపం ఉంటే ఐరన్ సప్లిమెంట్లను కొనడానికి బదులుగా, మీ రోజువారీ ఆహారంలో ఖర్జూరాలను చేర్చడం మంచిది.