ఇలా అయితే మీకు లైంగిక సంక్రమణ వ్యాధులు ఉన్నట్టే..

Published : Apr 08, 2023, 01:36 PM IST

లైంగిక సంక్రమణ వ్యాధులను గుర్తించని వారు చాలా మందే ఉన్నారు. కారణం దీని లక్షణాలు, సంకేతాలు తెలియకపోవడమే.   

PREV
16
ఇలా అయితే మీకు లైంగిక సంక్రమణ వ్యాధులు ఉన్నట్టే..

లైంగిక సంక్రమణ వ్యాధులను గుర్తించడం చాలా కష్టం. ఎందుకంటే ఇవి తరుచుగా వస్తుంటాయి. అలాగే తేలికపాటి లక్షణాలు మాత్రమే కనిపిస్తాయి. క్లామిడియా, గోనేరియా, హెర్పెస్, హెచ్ఐవి వంటి ఎస్టీడీల మాదిరిగా ఈ సంకేతాలను లైట్ తీసుకోకూడదు. లైంగిక కార్యకలాపాల వల్ల ఇవి వేగంగా వ్యాపిస్తాయి. ఇవి మీ మొత్తం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఈ వ్యాధులు నోటి, యోని సెక్స్  ద్వారా వ్యాప్తి చెందుతాయి. ఎస్టీడీల వల్ల ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయంటే.. 

26

అసాధారణ ఉత్సర్గ

మీ ప్రైవేట్ భాగాల నుంచి అంటే యోని, పురుషాంగం లేదా పాయువు నుంచి  ఏదైనా అసాధారణ ద్రవం బయటకు వస్తోందా? అయితే మీరు ఖచ్చితంగా హాస్పటల్ కు వెళ్లాల్సిందే. ఇంతకంటే  ముందు   అసాధారణ ఉత్సర్గ రంగు, వాసన, ఫ్రీక్వెన్సీ, రకాన్ని కూడా గమనించండి. 

36

మూత్ర విసర్జనలో ఇబ్బంది

మూత్రవిసర్జన చేసేటప్పుడు ఇబ్బందిగా, నొప్పిగా అనిపిస్తే మీ ప్రైవేట్ భాగాలలో ఇన్ఫెక్షన్ ఉందని అర్థం చేసుకోండి. దీనిని తగ్గించుకోవడానికి కొంతమంది ఇంటి నివారణలను ప్రయత్నించినప్పటికీ.. సమస్య దీర్ఘకాలికంగా కొనసాగితే హాస్పటల్ కు ఖచ్చితంగా వెళ్లాల్సిందే. 
 

46

జననేంద్రియాల్లో దురద

శరీరంలోని ద్రవాల పిహెచ్ స్థాయిల కారణంగా జననేంద్రియాలు శుభ్రంగా ఉంటాయి. సెక్స్ తర్వాత మీ ప్రైవేట్ పార్ట్స్ కడుక్కోవడం మంచిది. అయినప్పటికీ సాధారణ పరిశుభ్రతను పాటించిన తర్వాత కూడా మీకు ఆ ప్రాంతాలలో దురదగా అనిపిస్తే వెంటనే హాస్పటల్ కు వెళ్లడం మంచిది. 
 

56

జననేంద్రియాలలో పుండ్లు 

ప్రైవేట్ భాగాలను సరిగా చూసుకోనప్పుడు ఆ ప్రాంతంలో పుండ్లు, బొబ్బలు ఏర్పడతాయి. ప్రైవేట్ భాగాలను పరిశుభ్రంగా ఉంచుకున్నా పుండ్లు, బొబ్బలు తిరిగి వస్తూ ఉంటే అది లైంగిక సంక్రమణ వ్యాధి (ఎస్టిడి) కు సంకేతం కావొచ్చు.
 

66

ఎస్టీడీలు ప్రైవేట్ ప్రాంతాలతో నేరుగా సంబంధం లేని లక్షణాలను కూడా కలిగించొచ్చు. అంటే తక్కువ కడుపు నొప్పి, జ్వరం, తలనొప్పి, గొంతు నొప్పి, దద్దుర్లు, అలసట, విరేచనాలు, బరువు తగ్గడం వంటి లక్షణాలు హెచ్ఐవి వంటి ఎస్టీడీలకు సంకేతాలు కావొచ్చు. అందుకే ఇలాంటి సమస్యలు కనిపించినప్పుడు అనుమానం ఉంటే హాస్పటల్ కు వెళ్లడం మంచిది. 
 

click me!

Recommended Stories