ఎలాంటి రోగాలు లేకుండా ఆరోగ్యంగా బతకాలంటే.. !

Published : Apr 08, 2023, 09:34 AM IST

World Health Day: ఆరోగ్యంగా ఉంటేనే లైఫ్ ను ఎంజాయ్ చేస్తాం. మన పనులను పూర్తి చేస్తాం. అయితే కొన్ని సింపుల్ చిట్కాలను రోజూ ఫాలో అయితే మీరు లైఫ్ లాంగ్ ఆరోగ్యంగా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

PREV
17
 ఎలాంటి రోగాలు లేకుండా ఆరోగ్యంగా బతకాలంటే.. !
Image: Getty Images

World Health Day: మనం ఆరోగ్యంగా ఉంటేనే మన పనులను పూర్తిచేసుకుంటాం. ఆనందంగా జీవితాన్ని ఆస్వాధిస్తాం. కానీ కొంత మంది చిన్న చిన్న పనులకు కూడా అలసిపోతుంటారు. అంతేకాదు తరచుగా రోగాల బారిన పడుతుంటారు. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. కొన్ని పనులను రోజూ చేస్తే మీరు జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు. అవేంటంటే.. 
 

27

సంతోషకరమైన, సంతృప్తికరమైన జీవితాన్ని గడపడానికి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సమతుల్య ఆహారాన్ని తినడం, సరైన నిద్రతో సహా ఇంకొన్ని అలవాట్లు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. 

37

నిమ్మకాయ, గోరువెచ్చని నీరు 

గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ రసం కలిపి తాగితే జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇది మీ శరీరాన్ని హైడ్రేట్ చేయడానికి  కూడా సహాయపడుతుంది. రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి  అవసరమైన విటమిన్ సి నిమ్మరసంలో పుష్కలంగా ఉంటుంది. ఈ పానీయం శరీరంలోంచి విషాన్ని బయటకు పంపడానికి కూడా సహాయపడుతుంది. జర్నల్ ఆఫ్ మెడిసినల్ ఫుడ్ లో ప్రచురించబడిన ఒక అధ్యయనం నిమ్మరసం జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని, మలబద్దకాన్ని తగ్గిస్తుందని కనుగొన్నారు.
 

47
Image: Getty Images

అల్లం 

అల్లంలో సహజ శోథ నిరోధక, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. అల్లం శరీరంలో మంటను తగ్గించడానికి, మొత్తం ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి సహాయపడుతుంది. జర్నల్ ఆఫ్ పెయిన్ రీసెర్చ్  లో ప్రచురించిన ఒక సమీక్ష ప్రకారం.. ఆస్టియో ఆర్థరైటిస్, రుతుక్రమ తిమ్మిరి, ఇతర సమస్యల వల్ల కలిగే నొప్పిని, మంటను తగ్గించడానికి అల్లం సహాయపడుతుంది. అలాగే వికారం తగ్గించడానికి, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి కూడా ఇది సహాయపడుతుంది. అల్లం టీ  తాగినా, భోజనంలో చేర్చినా ఈ ప్రయోజనాలను పొందుతారు. 

57
nuts

గుప్పెడు గింజలు

బాదం, వాల్ నట్స్, జీడిపప్పు వంటి గింజల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, ఫైబర్ లు పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజూ గుప్పెడు గింజలను తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. రోజూ గుప్పెడు గింజలను తింటే మెదడు పనితీరు మెరుగుపడుతుంది. అలాగే బరువు కూడా కంట్రోల్ లో ఉండటమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. 
 

67

లోతైన శ్వాస

లోతైన శ్వాస వ్యాయామాలు ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి, ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, విశ్రాంతిని ప్రోత్సహించడానికి సహాయపడతాయి. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ బిహేవియరల్ మెడిసిన్ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. జస్ట్ ఐదు నిమిషాలు లోతైన శ్వాస వ్యాయామాలను చేయడం వల్ల ఒత్తిడి స్థాయిలు బాగా తగ్గుతాయి. మానసిక స్థితి కూడా మెరుగుపడుతుంది. నిశ్శబ్దంగా ఉండే ప్లేస్  లో కూర్చొని లేదా పడుకోని లోపలికి, బయటకు లోతైన శ్వాస తీసుకుంటూ బయటకు వదలండి. ఈ శ్వాస వ్యాయామాలు మీ ఒత్తిడి స్థాయిలను తగ్గించడానికి, మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచడానికి సహాయపడతాయి. 

77
Image: Getty Images

రోగనిరోధక శక్తి కోసం పసుపు

పసుపులో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి, శరీరంలో మంటను తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది మెదడు పనితీరును మెరుగుపరచడానికి, జీర్ణక్రియకు సహాయపడుతుంది. భోజనానికి పసుపు జోడించినా లేదా పసుపు టీ తాగినా ఈ ప్రయోజనాలను పొందుతారు.

click me!

Recommended Stories