ఓట్ మీల్ అనగానే అందరూ అనుకునేది బరువు తగ్గడానికి మాత్రమే ఉపయోగపడుతుందని. కానీ మనకు తెలియని విషయం ఏంటంటే.. ఇది మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. ఓట్ మీల్ ను అన్ని వయసుల వారు తినొచ్చు. దీన్ని బ్రేక్ ఫాస్ట్ గా తింటే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. ఓట్స్ లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. అలాగే కాల్షియం, ప్రోటీన్, ఐరన్, జింక్, థయామిన్, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. ఓట్స్ లో మన ఎముకలను బలంగా ఉంచే విటమిన్ బి కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఓట్స్ ను రెగ్యులర్ గా తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కాలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..