చలికాలంలో క్యారెట్, బీట్ రూట్ జ్యూస్ ను తాగితే మీకు ఆ సమస్యలే రావు

First Published | Nov 12, 2023, 7:15 AM IST

చలికాలంలో లేనిపోని రోగాలు వస్తుంటాయి. ఎందుకంటే ఈ సీజన్ లో మన ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది. దీనివల్లే దగ్గు, జలుబు, గొంతునొప్పి వంటి సమస్యలతో ఎక్కువగా బాధపడుతుంటారు. అయితే ఈ సీజన్ లో క్యారెట్, బీట్రూట్ జ్యూస్ లను తాగితే ఎన్నో రోగాలకు దూరంగా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

చలికాలం విపరీతంగా చలిపెడుతుంది. దీంతో మన జీవనశైలి కూడా మారుతుంది. వాతావరణంలో మార్పుల వల్ల మన రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుంది. చలికాలంలో ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటే జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలు వస్తాయి. ఈ సీజన్ లో మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. మనల్ని ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు ఈ సీజన్ లో పుష్కలంగా లభిస్తాయి. ఇలాంటి వాటిలో క్యారెట్, బీట్ రూట్ కూడా ఉన్నాయి. 

క్యారెట్, బీట్ రూట్ ను మనం ఎన్నో విధాలుగా తినొచ్చు. అయితే చాలా మంది వీటిని జ్యూస్ గానే ఎక్కువగా తీసుకుంటారు. క్యారెట్, బీట్ రూట్ జ్యూస్ లో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే వీటిని చలికాలంలో తాగడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఎన్నో పోషకాలు, యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉండే క్యారెట్లు , బీట్రూట్ లు ఎన్నో ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి.

Latest Videos


క్యారెట్, బీట్ రూట్ లు రక్తపోటును తగ్గించడానికి, శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి, ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి. క్యారెట్లలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ ఇ, కాల్షియం, ఫైబర్, ప్రోటీన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బీట్రూట్ లో ఇనుము, సోడియం, పొటాషియం, ఫైబర్, సహజ చక్కెరలు ఉంటాయి. మరి ఈ జ్యూస్ లను తాగడం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది

చలికాలంలో తరచుగా కడుపునకు సంబంధించిన సమస్యలతో ఎక్కువగా బాధపడుతుంటారు. ఇలాంటి వారికి క్యారెట్, బీట్ రూట్ జ్యూస్ లు మంచి ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ జ్యూస్ లను తాగితే ఉపశమనం కలుగుతుంది. జీర్ణసమస్యలున్నవారు వీటిని రెగ్యులర్ గా తాగొచ్చు. వీటిలో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది.  మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

క్యాన్సర్ నివారించడానికి

క్యారెట్, బీట్ రూట్ జ్యూస్ లలో క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను నివారించే లక్షణాలుంటాయి. వీటిలో ఉండే కొన్ని యాంటీ క్యాన్సర్ లక్షణాలు శరీరంలో క్యాన్సర్ కణాలు ఏర్పడకుండా నిరోధిస్తాయి. క్యాన్సర్ తో బాధపడేవారు ఈ జ్యూస్ ను రెగ్యులర్ గా తాగితే ప్రయోజనకరంగా ఉంటుంది. 

రక్తం లోపం 

శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారికి కూడా ఈ జ్యూస్ ను మంచి ప్రయోజనకరంగా ఉంటాయి. క్యారెట్, బీట్ రూట్ జ్యూస్ లల్లో ఇనుము పుష్కలంగా ఉంటుంది. ఇది రక్త సంబంధిత సమస్యలను నయం చేస్తుంది. అలాగే ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచుతుంది. 

రక్తపోటు అదుపులో

అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారికి కూడా క్యారెట్, బీట్ రూట్ జ్యూస్ లు ఎంతో మేలు చేస్తాయి.  ఇవి పెరిగిన రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది. వీటిలో ఉండే పొటాషియం, మెగ్నీషియం రక్తపోటును అదుపులో ఉంచుతాయి. 
 


బరువు తగ్గడానికి

బరువు తగ్గాలనుకునేవారికి ఇది మంచి డ్రింక్. మీరు బరువును తగ్గాలనుకుంటే క్యారెట్,  బీట్రూట్ జ్యూస్ లను తాగొచ్చు. ఈ జ్యూస్ లో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరం నుంచి అదనపు కొవ్వును తగ్గించడానికి సహాయపడుతుంది.

click me!