వయోజన పురుషుల శరీరంలో 65% నీరు, ఆడవారి శరీరంలో 52% నీరు ఉంటుంది. ఇది మనం బతకడానికే కాదు.. మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. మనం అన్ని విధాలా ఆరోగ్యంగా ఉండటానికి నీరు చాలా చాలా అవసరం. నీరు మన శరీరం లోపలి భాగాన్ని శుభ్రపరచడానికి చాలా అవసరం. నీరు కూడా మన శరీరానికి ఆక్సిజన్ అందించే పని చేస్తుంది. అయితే చాలా మంది చలికాలంలో నీటిని అస్సలు తాగరు. ఎందుకంటే ఈ సీజన్ లో దాహంగా అనిపించదు. అలాగే చాలా మంది ఈ సీజన్ లో చలి, జలుబు, గొంతునొప్పి వంటి సమస్యల బారిన ఎక్కువగా పడుతుంది. అందుకే ఈ సీజన్ లో మనల్ని మనం ఆరోగ్యంగా ఉంచడానికి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా నీటిని ఖచ్చితంగా తాగాలి. చలికి చల్లనీటిని తాగాలనిపించదు. అందుకే గోరువెచ్చని నీటిని తాగండి. గోరువెచ్చని నీరు మనల్ని ఎన్నో రోగాలకు దూరంగా ఉంచుతుంది తెలుసా? చలికాలంలో గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల మనకు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం..