దీపావళి 2023: డయాబెటిస్ పేషెంట్లు కూడా దీపావళి స్వీట్లను తినొచ్చు.. కాకపోతే..!

First Published | Nov 11, 2023, 12:43 PM IST

Diwali 2023: దీపావళి నాడు ఎక్కువ చూసినా దీపాలే కనిపిస్తాయి. ఈ వెలుగుల పండుగను ఎన్నో విధాలుగా జరుపుకుంటారు. ఏదేమైనా ఈ పండుగకు రకరకాల స్వీట్లు నోరూరిస్తాయి. తీయగా, టేస్టీగా ఉండే స్వీట్లను ఎవరు తినకుండా ఉంటారు చెప్పండి. కానీ షుగర్ పేషెంట్లు మాత్రం ఉండాలి. ఎందుకంటే ఇవి వారి బ్లడ్ షుగర్ ను పెంచేస్తాయి. అయితే వీళ్లు కూడా దీపావళి స్వీట్లను ఎంచక్కా లాగించొచ్చు. కానీ కొన్ని పనులను చేస్తేనే.. 
 

diabetes

పండుగ సీజన్ లో ప్రతి ఇల్లు స్వీట్లు, పిండివంటల వాసనతో నిండిపోతుంది. కజ్జికాయలు, లడ్డూలు, స్వీట్లు నోరూరిస్తాయి. ఏదేమైనా నార్మల్ డేస్ కంటే పండుగ సమయంలోనే స్వీట్లను ఎక్కువగా తింటుంటారు. కానీ డయాబెటిస్ పేషెంట్లకు మాత్రం స్వీట్లు తినాలా? వద్దా? అన్న డౌట్ ఉంటుంది. ఎందుకంటే చక్కెరతో తయారుచేసిన స్వీట్లు వారి రక్తంలో చక్కెర స్థాయిలను అమాంతం పెంచేస్తాయి. అయితే వీళ్లు కొన్ని చిట్కాలను పాటిస్తే మాత్రం పండుగ స్వీట్లను ఆస్వాదించొచ్చు అంటున్నారు నిపుణులు. ఇందుకోసం మధుమేహులు ఏం చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.. 

diabetes diet

ఉదయం ఇలా.. 

ఉదయం కొన్ని పనులను ఖచ్చితంగా చేస్తే మీరు ఆరోగ్యంగా ఉంటారు. అలాగే మీ రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం కూడా తగ్గుతుంది. కాబట్టి ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ లో తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు మొదలైనవి హెల్తీ ఫుడ్ ను ఖచ్చితంగా తినండి. ఇవి మీ బ్లడ్ షుగర్ ను కంట్రోల్ లో ఉంచుతాయి.
 


వ్యాయామం

క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మీరు ఫిట్ గా, ఆరోగ్యంగా ఉంటారు. వ్యాయామం లేదా యోగా చేసినా మీ  షుగర్ లెవల్స్ ను కంట్రోల్ లో ఉంటాయి. అలాగే మీకు ఎన్నో రోగాల ముప్పును తప్పిస్తాయి. అందుకే ప్రతిరోజూ శారీరక శ్రమ చేయండి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది.
 

లిమిట్ లో తినడం

హెవీగా తినడం మీ  ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఇది మీ బరువును పెంచడంతో పాటుగా ఎన్నో అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది. ఎంత టేస్టీగా ఉన్నా సరే దాన్ని లిమిట్ లోనే తినండి. ఇలా తినడం వల్ల మీ రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. ఫుడ్ ను నియంత్రిస్తే చక్కెర స్థాయి కూడా నియంత్రణలో ఉంటుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. 
 

తక్కువ కేలరీల ఆహారం 

పండుగలప్పుడు చాలా చాలా ఇళ్లలో పూరీ, పనీర్ వంటి ఆయిలీ ఫుడ్ నే ఎక్కువగా తింటుంటారు. కానీ ఇవి మీ బరువును పెంచడంతో పాటుగా మీ  ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తాయి. అందుకే పండుగలైనా సరే వీటికి దూరంగా ఉండండి. అప్పుడే మీరు ఆరోగ్యంగా ఉంటారు. వేయించడానికి బదులుగా బేక్, గ్రిల్ వంటి ఆరోగ్యకరమైన ఆహారాలను తినండి. 
 

Latest Videos

click me!