బ్రా వేసుకోవడం, వేసుకోకపోవడం వల్ల కలిగే ప్రయోజనాలు, నష్టాలు

First Published | Sep 6, 2023, 1:59 PM IST

మహిళలకు అవసరమైన దుస్తుల్లో బ్రా ఒక భాగం. వీటిని ధరించడం వల్ల శరీర ఆకృతి బాగా కనిపిస్తుంది. అయితే దీన్ని వేసుకోవడం వల్ల కొన్ని సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. 
 

మహిళల దుస్తుల్లో బ్రా ఒక ముఖ్యమైన భాగం. ఇది ఎగువ శరీరాన్ని ఆకృతి మెరుగ్గా ఉంచడానికి, రొమ్ములకు మద్దతునివ్వడానికి ధరిస్తారు. కానీ వీటిని ధరించడం వల్ల చాలా మందికి కొన్ని సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా దురద పెట్టడం, దద్దుర్లు, భుజంపై పట్టీ గుర్తులు కనిపిస్తాయి. ఇవి సాధారణ లక్షణాలు. కానీ మీరు బ్రా వేసుకున్నప్పుడు శరీర పై భాగం ఆకారం చాలా వింతగా కనిపిస్తుంది. ఈ సంగతి పక్కన పెడితే  బ్రా ధరించడం వల్ల కలిగే లాభాలు, నష్టాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. చాలా మంది టైట్ బ్రాలనే వేసుకుంటారు. కానీ చాలా టైట్ బ్రా ధరించడం వల్ల రొమ్ముల కింద భాగంలో రక్త ప్రసరణపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల మహిళల ఛాతీలో లేదా చుట్టుపక్కల నొప్పి కలుగుతుంది. 

Latest Videos


2. బ్రా వేసుకోకుండా నిద్రపోవడం వల్ల రాత్రిళ్లు బాగా నిద్రపడుతుంది. ఎందుకంటే బ్రా వేసుకోకపోతే ఎలాంటి ఆటంకం లేకుండా సులువుగా శ్వాస తీసుకోవచ్చు. అయితే బ్రా వేసుకుంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. బ్రా వేసుకోకపోవడం వల్ల శ్వాస, రక్త ప్రసరణ రెండింటికీ సంబంధించిన సమస్యలు రావు.  
 

3. మీకు చెమటలు ఎక్కువగా పట్టే అవకాశం ఉంటే.. సరైన క్లాత్ బ్రా ను ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే కొన్ని రకాల బట్టలు చెమటను సరిగా గ్రహించవు. దీని కారణంగా ఛాతీ, బ్రా బట్టల మధ్య నిరంతర ఘర్షణ దురద, దద్దుర్లను కలిగిస్తుంది. చెమట గ్రహించకపోవడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ల అవకాశం పెరుగుతుంది. 
 

4. పెడ్ బ్రాలను ఎక్కువగా ఉపయోగించే మహిళలకు చనుమొనలో సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే చనుమొనలు చాలా సున్నితమైనవి కాబట్టి.. అవి పొడిగా మారుతాయి. దీంతో అక్కడ దురద పెడుతుంది. అందుకే ఇంట్లో ఉన్నప్పుడు బ్రా లేకుండా ఉండటం మంచిది.
 

5. అవసరం లేనప్పుడు కూడా బ్రా వేసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి. ఆకారం పరంగా చాలా టైట్ బ్రా ధరించడం వల్ల రొమ్ము కణజాలం దెబ్బతింటుంది.

6. బ్రా ధరించడం వల్ల రొమ్ముకు సరైన సపోర్ట్ లభిస్తుంది. బ్రా రొమ్ములను వేలాడదీయకుండా కాపాడుతుంది. కానీ ఇది మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అందుకే వీటిని అవసరానికి మాత్రమే ధరించండి. 

click me!