కొలెస్ట్రాల్ ఎక్కువుందా..? ఈ ఫుడ్ ను తినండి తగ్గిపోతుంది

Published : May 14, 2023, 01:24 PM IST

మనం తినే ఆహారాన్ని మార్చడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ తగ్గుతుందంటున్నారు నిపుణులు. అలాగే మన రక్తప్రవాహంలో ప్రవహించే కొవ్వుల పరిమాణం కూడా మెరుగుపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడే కొన్ని ఆహార కలయికలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..   

PREV
16
 కొలెస్ట్రాల్ ఎక్కువుందా..? ఈ ఫుడ్ ను తినండి తగ్గిపోతుంది
high cholesterol

అధిక కొలెస్ట్రాల్ రానురాను గుండెపోటు లేదా స్ట్రోక్ వంటి ఎన్నో ప్రమాదకరమైన రోగాలకు దారితీస్తుంది. "చెడు" కొలెస్ట్రాల్ అని పిలువబడే తక్కువ-సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ కొలెస్ట్రాల్ సాంద్రత చాలా ఎక్కువగా ఉంటే మీ ధమనుల గోడలలో ఫలకం ఏర్పడుతుంది. ఈ ఫలకాలలో ఒకటి చీలిపోతే రక్తం గడ్డకడుతుంది. రక్త ప్రవాహాన్ని నిరోధిస్తుంది. అలాగే గుండెపోటు లేదా స్ట్రోక్ వస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి ఎలాంటి ఫుడ్ కాంబినేషన్ ను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

26

పప్పు, బ్రౌన్ రైస్

మనం చేసుకునే వంటల్లో పప్పు ఎక్కువగా ఉంటుంది. వారంలో మూడు నాలుగు సార్లైనా పప్పును తింటుంటారు. నిజానికి పప్పుల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడుతుంది. దీనిని చెడు కొలెస్ట్రాల్ అంటారు. బ్రౌన్ రైస్ తృణధాన్యాల గొప్ప మూలం. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని 20% వరకు తగ్గిస్తుందని తేలింది.
 

36

బార్లీ, ఓట్స్, ఇతర తృణధాన్యాలు

ఓట్స్, ఓట్ బ్రాన్ మాదిరిగా బార్లీ, ఇతర తృణధాన్యాలు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. వీటిలో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి అల్పాహారంలో చీరియోస్ వంటి ఓట్ మీల్ లేదా చల్లని వోట్ ఆధారిత తృణధాన్యాలను తినండి. 
 

46


బాదం, పెరుగు

బాదంలో గుండెకు మేలు చేసే ఆరోగ్యకరమైన మోనోశాచురేటెడ్ కొవ్వులు, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. ఇది ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. బ్రిటిష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్  లో ప్రచురించబడిన ఒక అధ్యయనం.. పెరుగు తినడం వల్ల మొత్తం కొలెస్ట్రాల్ స్థాయిలు 4% వరకు తగ్గుతాయని కనుగొన్నారు. పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడానికి, మంటను తగ్గించడానికి సహాయపడతాయి.
 

56
Image: Getty

కొవ్వు చేపలు

ఆంకోవీస్, బ్లాక్ కాడ్, మాకేరెల్ లేదా సాల్మన్ వంటి కొవ్వు చేపలు కూడా కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మొదటిది కొవ్వు చేపలను సంతృప్త కొవ్వులను కలిగి ఉన్న ఇతర ప్రోటీన్ వనరులకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించొచ్చు. రెండోది కొవ్వు చేపలు ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలతో సహా అసంతృప్త కొవ్వుల మంచి మిశ్రమాన్ని కలిగి ఉంటాయి. ఇవి గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తాయని తేలింది.
 

66

వంకాయ, బెండకాయ, బీన్స్

ఈ రెండు తక్కువ కేలరీల కూరగాయలు. ఇవి కరిగే ఫైబర్ కు మంచి వనరులు. బీన్స్ లో ముఖ్యంగా కరిగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అవి జీర్ణం కావడానికి కొంత సమయం పడుతుంది. అంటే భోజనం తర్వాత మీ కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారికి బీన్స్ మంచి ఆహారం.

Read more Photos on
click me!

Recommended Stories