ఈ అలవాట్లు బీపీని పెంచుతాయి.. ఎలా తగ్గించుకోవాలంటే..!

Published : May 14, 2023, 12:32 PM IST

మారుతున్న జీవనశైలి రక్తపోటు పెరగడానికి ప్రధాన కారణం. అయితే కొన్ని చిట్కాలతో ఈ సమస్యను తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు.  

PREV
112
ఈ అలవాట్లు బీపీని పెంచుతాయి.. ఎలా తగ్గించుకోవాలంటే..!
Image: Getty

ఆహారంలో మార్పులు, తప్పుడు జీవనశైలి కారణంగా బీపీ పేషెంట్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మనం తినే ఆహారం, చేసే పనులు శరీరంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ఈ కారణంగానే రక్తపోటు పెరుగుతుంది. ఇది మన గుండె ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. నేషనల్ హార్ట్ ఇనిస్టిట్యూట్ ప్రకారం.. వయస్సు, జెనెటిక్స్, ఎన్నో రకాల మందులు శరీరంలో అధిక రక్తపోటు సమస్యను పెంచుతాయి. అయితే కొన్ని సాధారణ మార్పులు ఈ సమస్య ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ప్రపంచ హైపర్ టెన్షన్ డే సందర్భంగా శరీరంలో ఈ సమస్య పెరగడానికి దోహదపడే కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
 

212
Image: Getty

ప్రపంచ రక్తపోటు దినోత్సవం

అధిక రక్తపోటు సమస్యను నివారించడానికి, నియంత్రించడానికి ప్రతి సంవత్సరం మే 17 న ప్రపంచ రక్తపోటు దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఒక బిలియన్ మందికి పైగా ప్రజలను ప్రభావితం చేసే ఈ సమస్య గుండె జబ్బులు, కొరోనరీ ఆర్టరీ డిసీజ్, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది.
 

312

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 30 నుంచి 79 సంవత్సరాల మధ్య వయస్సున్న 1.28 బిలియన్ల మందికి అధిక రక్తపోటు ఉంది. వీరిలో మూడింట రెండొంతుల మంది అల్పాదాయ, మధ్య ఆదాయ దేశాలకు చెందినవారే.  కాగా సుమారు 46 శాతం మందికి ఈ సమస్యతో బాధపడుతున్నట్టు కూడా తెలియదు.

412
hypertension

రక్తపోటు అంటే ?

రక్తపోటు అనేది మీ ధమనుల గోడలకు రక్తాన్ని నెట్టడానికి పనిచేసే ఒత్తిడి. ధమనులు ఆ రక్తాన్ని గుండె నుంచి శరీరంలోని ఇతర భాగాలకు తీసుకువెళతాయి. రక్తపోటు రోజంతా పెరుగుతుంది. తగ్గుతుంది.
 

512

రక్తపోటుకు కారణమేంటి?

ఉప్పును ఎక్కువగా తీసుకోవడం

ఉప్పు మన ఆహార రుచిని పెంచుతుంది. కానీ ఉప్పును ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్ట్ ప్రకారం.. మీ ఆహారంలో ఎక్కువ సోడియాన్ని చేర్చడం వల్ల రక్తపోటు పెరుగుతుంది.  ఎన్ఐహెచ్ ప్రకారం.. మన మూత్రపిండాలు రోజుకు 120 క్వార్ట్లకు పైగా రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి. అవి శరీరం అంతటా కణాల నుంచి విషాన్ని బయటకు పంపుతాయి. ఇవి మూత్రం ద్వారా శరీరం నుంచి బయటకు వస్తాయి. ఉప్పును ఎక్కువగా తినడం వల్ల మూత్రపిండాలు ద్రవాన్ని తొలగించడం కష్టమవుతుంది. ఇది రక్తపోటును పెంచుతుంది.

 

612
Image: Getty Images

కాఫీ

హెల్త్ హార్వర్డ్ ప్రకారం.. కాఫీ మన శరీరంలో చురుకుదనాన్ని పెంచుతుంది. అందుకే దీనిని ఎనర్జీ డ్రింక్ గా తీసుకుంటారు. కాఫీలో పంచదార కలిపినప్పుడు అవి శరీరంలోకి వెళ్లి రక్తపోటును పెంచుతాయి. మెడికల్ న్యూస్ టుడే ప్రకారం.. కెఫిన్ ఒక వాసోకాన్స్ట్రిక్టర్. ఇది రక్త నాళాల పరిమాణాన్ని తగ్గించి రక్తపోటును పెంచుతుంది.
 

712
smoking

ధూమపానం

పగటిపూట ఎక్కువగా స్మోకింగ్ చేసేవారికి రక్తపోటు బాగా పెరుగుతుంది. స్మోకింగ్ మీ గుండెపై ఒత్తిడిని పెంచుతుంది. నిజానికి ధూమపానం రక్త నాళాలను కుదిస్తుంది. ఈ కారణంగా రక్తపోటు స్థాయి ఎక్కువగా ఉంటుంది.

812

ఆల్కహాల్ తీసుకోవడం

మందును ఎక్కువగా తాగడం వల్ల హృదయ ఆరోగ్యం ప్రభావితం  అవుతుంది. ఇది రక్తపోటుతో పాటుగా శరీరంలో డయాబెటిస్, క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.
 

 

912
Image: Getty

హై బీపీ తగ్గాలంటే

క్రమం తప్పకుండా వ్యాయామం 

శారీరకంగా చురుకుగా లేకపోవడం వల్ల కూడా రక్తపోటు పెరుగుతుంది. క్రమం తప్పకుండా 30 నిమిషాల పాటు వ్యాయామం  చేయడం వల్ల మీ శరీరంలో రక్త ప్రవాహం నియంత్రణలో ఉంటుంది.  వ్యాయామంతో పాటు బ్రిస్క్ వాకింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్, ఏరోబిక్స్ కూడా చేయొచ్చు.

1012

ఆరోగ్యకరమైన ఆహారం 

మీ ఆహారంలో తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులను చేర్చండి. సంతృప్త కొవ్వు, కొలెస్ట్రాల్ ను నియంత్రించడం ద్వారా అధిక రక్తపోటును తగ్గించొచ్చు. చక్కెర, ఉప్పు ఎక్కువగా తీసుకోవడం కూడా మానుకోవాలి.
 

1112

ఊబకాయాన్ని తగ్గించండి

మీ శరీర బరువు రోజురోజుకు పెరుగుతుంటే.. శరీరంలో అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఉంది. బరువు తగ్గితే మీ శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇది స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
 

1212
Image: Getty

ఒత్తిడికి దూరంగా ఉండండి

మితిమీరిన ఆందోళన వల్ల రక్తపోటు సమస్య వస్తుంది. దీన్ని నివారించడానికి ఇష్టమైన పనులు చేయడానికి ఎక్కువ సమయం కేటాయించండి. మిమ్మల్ని మీరు రిలాక్స్ గా ఉంచుకోండి. ఏడెనిమిది గంటలు నిద్రపోండి. దీంతో  ఒత్తిడి తగ్గుతుంది. 

click me!

Recommended Stories