జాగ్రత్తలు తప్పనిసరి..
అక్యుప్రెషర్ సమర్థవంతంగా పనిచేస్తుంది. అయితే ఈ విధానం పాటించే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వైద్యుల సూచనలు కచ్చితంగా పాటించాలి. ఆక్యుప్రెషర్ పాయింట్లను నొక్కే సమయంలో గాఢంగా శ్వాస తీసుకుంటూ, నిదానంగా శ్వాస వదలాలి.
గట్టిగా నొక్కకూడదు. ఏ ఆక్యుప్రెషర్ పాయింట్లను ప్రెస్ చేయాలో తెలుసుకోవాలి. వాటి స్థానాలు కచ్చితంగా తెలిసిన తర్వాత మాత్రమే నొక్కాలి. ఈ ప్రక్రియలో భాగంగా ఏమైనా నొప్పి కలిగినట్లు అనిపిస్తే వెంటనే ఆపేసి, వైద్యులను సంప్రదించాలి.