రాత్రుళ్లు చేసే ఈ తప్పులే డయాబెటిస్‌కి కారణం.. మీరూ చేస్తున్నారా?

First Published | Jan 15, 2025, 4:22 PM IST

డయాబెటిస్ ప్రస్తుతం ప్రపంచాన్ని భయపెడుతోంది. ముఖ్యంగా భారత్ లో షుగర్ బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. షుగర్ పేషెంట్స్ రాత్రిపూట చక్కెర స్థాయిలను నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. అయితే మనకు తెలిసో, తెలియకో చేసే కొన్ని తప్పులు రాత్రుళ్లు షుగర్ లెవల్స్ పెరగడానికి కారణమని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

వంశపార్యంగా వచ్చే డయాబెటిస్ బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. 30 ఏళ్లు నిండిన వారిలో కూడా షుగర్ లెవల్స్ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మధుమేహం ఉన్న వారికి రాత్రిపూట షుగర్ లెవల్స్ సాధారణంగా ఉండడం ముఖ్యం. రాత్రుళ్లు షుగర్ లెవల్స్ 140 కంటే ఎక్కువగా ఉండకూడదని నిపుణులు చెబుతుంటారు. 

కానీ రాత్రిపూట తీసుకునే చెడు ఆహారపు అలవాట్లు, చక్కెర ఎక్కువగా ఉండే ఫుడ్ కారణంగా రక్తంలో షుగర్ లెవల్స్ పెరుగుతుంటాయి. ముఖ్యంగా రాత్రుళ్లు మనం చేసే కొన్ని తప్పులు శరీరంలో చక్కెర స్థాయిలు పెరగడానికి కారణమవుతాయని నిపుణులు అంటున్నారు. 


షుగర్ లెవల్స్ పెరగకూడదంటే రాత్రి పూట ఆలస్యంగా అస్సలు భోజనం చేయకూడదు. రాత్రుళ్లు ఆలస్యంగా తినే వారిలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. కాబట్టి రాత్రి 8 గంటల్లోపు భోజనం చేయాలని నిపుణులు చెబుతున్నారు. పడుకునే ముందు కనీసం 2 గంటల ముందు డిన్నర్ పూర్తి చేయాలని సూచిస్తున్నారు. 

ఇక రాత్రుళ్లు కార్బోహైడ్రేట్లను అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇవి అధికంగా ఉండే పండ్లు, పాల ఉత్పత్తులు, కూరగాయలు, ధాన్యాలకు దూరంగా ఉండాలి. 

ధూమపానం ఆరోగ్యానికి హానికరమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే రాత్రిపూట స్మోకింగ్ మరింత ప్రమాదకరమని నిపుణులు అంటున్నారు. దీనివల్ల శరీరంలో చక్కెర స్థాయిలు ఆందోళనకర స్థాయికి పెరుగుతాయని అంటున్నారు. 

రాత్రి పడుకునే ముందు కెఫీన్‌ను ఎక్కువగా తీసుకోకూడదు. కొంతమందికి రాత్రిపూట కాఫీ తాగే అలవాటు ఉంటుంది. కానీ ఇది మధుమేహం ఉన్నవారికి ప్రమాదకరం. పడుకునే ముందు ఎట్టి పరిస్థితుల్లో కాఫీ తాగకూడదు. 

నిద్రలేమి కూడా శరీరంలో చక్కెర స్థాయిలు పెరగడానికి కారణమని నిపుణులు చెబుతున్నారు. ఆలస్యంగా పడుకోవడం, నిద్రలో నాణ్యత లేకపోవడం వంటివి షుగర్ లెవల్స్ పెరగడానికి కారణమవుతాయని అంటున్నారు. అందుకే రాత్రి పడుకునే ముందు యోగా, మెడిటేషన్ వంటివి చేయాలి. 

Latest Videos

click me!