తిన్నది అరగాలంటే ఏం చేయాలి?

Published : Jan 17, 2025, 11:01 AM IST

జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేయకపోయినా, హెవీగా తిన్నా అస్సలు అరగదు. ఇలాంటి వారు కొన్ని రకాల పండ్లను తింటే మాత్రం వెంటనే అరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే? 

PREV
17
తిన్నది అరగాలంటే ఏం చేయాలి?

బిజీ లైఫ్ స్టైల్ వల్ల చాలా మంది తినడానికి కూడా సరిగ్గా టైంను కేటాయించడం లేదు. ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం పూర్తిగా మానేసారు. ఏమైనా ఆకలి అయ్యిందంటే ఏదో ఒకటి  తినేసి కడుపు నింపుకుంటున్నారు. కానీ దీనివల్ల జీర్ణసమస్యలు వస్తాయి. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం మీరు హెల్తీ ఫుడ్ ను తినాలి. 

27

అయితే చాలా సార్లు చాలా మంది తిన్నది అరగక ఇబ్బంది పడుతుంటారు. దీనివల్ల గ్యాస్, ఎసిడిటీ వంటి జీర్ణ సమస్యలు వస్తాయి. మోతాదుకు మించి తినడం,  జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేయకపోవడం వల్లే తిన్నది జీర్ణం కాదు. కానీ కొన్ని రకాల పండ్లు తిన్నది అరిగేలా చేయడానికి సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ పండ్లలో రకరకాల పోషకాలు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. 
 

37

తిన్నది అరగాలంటే ఏ పండ్లను తినాలి?


ఆపిల్స్

ఆపిల్స్ జీర్ణం కావడానికి బాగా సహాయపడతాయి. ఈ పండ్లలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ముఖ్యంగా దీనిలో పెక్టిన్ అనే కరిగే ఫైబర్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది మలం సాఫీగా బయటకు రావడానికి సహాయపడుతుంది. అలాగే పేగు కదలికల్ని నియంత్రిస్తుంది. దీంతో మీ జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఆపిల్స్ లో ఉండే ఎంజైమ్లు ఆహారాన్ని బాగా విచ్ఛిన్నం చేయడానికి సహాయపడతాయి.
 

47

అరటిపండ్లు

అరటిపండు జీర్ణక్రియకు సహాయపడటంలో బాగా ఉపయోగపడుతుంది. వీటిలో ఉండే ప్రీబయోటిక్స్ గట్ బ్యాక్టీరియాను సమతుల్యంగా ఉంచడానికి సహాయపడతాయి. మీకు తెలుసా? అరటిపండ్లు చాలా సులభంగా జీర్ణమవుతాయి. అలాగే మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. అందుకే చాలా మంది భోజనం చేసిన తర్వాత అరటిపండును ఖచ్చితంగా తింటుంటారు. అరటిపండ్లు ఆహారాన్ని బాగా జీర్ణం చేయడానికి సహాయపడతాయి. 
 

57
papaya

బొప్పాయి

బొప్పాయిలో పాపైన్ అనే జీర్ణ ఎంజైమ్ ఉంటుంది. ఇది ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది. అలాగే జీర్ణక్రియకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పండులో విటమిన్లు, ఫైబర్, ఖనిజాలు వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి మొత్తం జీర్ణ ఆరోగ్యానికి సహాయపడతాయి. 
 

67

బెర్రీలు

బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలు, బ్లాక్ బెర్రీలు వంటి రకరకాల బెర్రీ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఈ పండ్లలో ఉండే ఫైబర్ కంటెంట్ ప్రేగు కదలికలను మెరుగుపరుస్తుంది. అలాగే ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోమ్ కు సహాయపడుతుంది. అందుకే పై పండ్లతో పాటుగా బెర్రీలను తింటే కూడా తిన్నది బాగా జీర్ణమవుతుందని చెబుతారు.

77
kiwi

కివీ

కివీలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. అలాగే ఆక్టినిడిన్ అనే ఎంజైమ్ కూడా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థకు ఎంతగానో సహాయపడుతుంది. ఈ ఎంజైమ్ ప్రోటీన్ ను విచ్ఛిన్నం చేయడానికి కూడా ఎంతగానో సహాయపడుతుంది. అలాగే అజీర్ణం లక్షణాలను కూడా తగ్గిస్తుంది. కివిలో గట్ ను ఆరోగ్యంగా ఉంచడానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే జీర్ణ సమస్యలున్న వారు ఈ పండ్లను రోజూ తినాలని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. 

click me!

Recommended Stories