
ఎండాకాలం తాజా పండ్లు, కూరగాయలు, వాటి రసాలకు మంచి సమయం. అయితే కొన్ని ఫ్రూట్ జ్యూస్ లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందులో బీట్ రూజ్ జ్యూస్. రోజూ ఒక గ్లాస్ బీట్ రూట్ జ్యూస్ ను తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. ఈ పానీయం డిటాక్స్, రక్తపోటు ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
బీట్ రూట్ లో ఆరోగ్యకరమైన పోషకాలు, ఖనిజాలు ఉంటాయి. ఇది జీర్ణక్రియకు మంచిది. చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని పెంచుతుంది. అలాగే అథ్లెటిక్ పనితీరును మెరుగుపరుస్తుంది. దీని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు మీరు వేగంగా బరువు తగ్గడానికి సహాయపడతాయి.
బీట్ రూట్ జ్యూస్ హైపర్ టెన్షన్ కు మంచిదా?
ఒకప్పుడు పెద్దవయసు వారికి మాత్రమే అధిక రక్తపోటు సమస్య వచ్చేది. ఇప్పుడు హై బీపీ అన్నివయసుల వారికీ వస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 30 నుంచి 79 సంవత్సరాల వయస్సు గల దాదాపు 1.3 బిలియన్ల పెద్దలకు అధిక రక్తపోటు ఉంది. ఇందులో 46 శాతం మంది పెద్దలకు తమకు ఈ సమస్య ఉందని తెలియదు. అధిక రక్తపోటు పేషెంట్లు బీట్ రూట్ జ్యూస్ ను రోజూ తాగితే రక్తపోటు స్థాయిలు తగ్గుతాయి. అలాగే ఇంకెన్నో సమస్యలు తగ్గిపోతాయి.
బీట్ రూట్ ను మీ రోజు వారి డైట్ లో చేర్చడం వల్ల అధిక రక్తపోటు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉండటం వల్ల బీట్ రూట్ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. కానీ డైటరీ నైట్రేట్ సమృద్ధిగా ఉండటం రక్తపోటుకు ఇది సూపర్ ఫుడ్ గా పరిగణించబడుతుంది.
డైటరీ నైట్రేట్ నైట్రిక్ ఆక్సైడ్ (ఎన్ఓ)గా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. మానవ శారీరక పనితీరులో నైట్రిక్ ఆక్సైడ్ రక్త నాళాలను సడలిస్తుంది. అలాగే విస్తరిస్తుంది. ఇది అధిక రక్తపోటును గణనీయంగా తగ్గించడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. బచ్చలికూర, సెలెరీ, క్యాబేజీ, ముల్లంగి కూడా నైట్రిక్ ఆక్సైడ్ ను పెంచుతాయి.
ప్రతిరోజూ 250 మిల్లీ లీటర్ల బీట్రూట్ జ్యూస్ ను తాగడం వల్ల అధిక రక్తపోటు ఉన్నవారి రక్తపోటు తగ్గుతుందని లండన్ లోని క్వీన్ మేరీ విశ్వవిద్యాలయంలోని బ్రిటీష్ హార్ట్ ఫౌండేషన్ (బిహెచ్ఎఫ్) 2015 పరిశోధనలో తేలింది. కొన్ని అధ్యయనాలు ప్రతిరోజూ 2 కప్పుల బీట్ టూర్ రసం తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నాయి.
ఒక కప్పు బీట్రూట్ రసం తీసుకోవడం వల్ల రక్తపోటులో 8/4 ఎంఎంహెచ్జి తగ్గిందని బిహెచ్ఎఫ్ అధ్యయనం తేల్చింది. దీర్ఘకాలంలో రక్తపోటు కలిగించే హృదయ సంబంధ సమస్యలను తగ్గించడానికి కూడా ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.
రక్తపోటుకు బీట్ రూట్ జ్యూస్ ఎలా ఉపయోగించాలి?
మంచి ఫలితాల కోసం... బీట్ రూట్ లో ఉప్పు, పంచదార కలపకుండా జ్యూస్ రూపంలో తీసుకోవడం ఉత్తమ మార్గమని నిపుణులు చెబుతున్నారు. రోజుకు సుమారు 180 మిల్లీలీటర్ల నుంచి 250 మిల్లీలీటర్ల వరకు రెండు వారాల పాటు ఈ జ్యూస్ ను తాగొచ్చు.
బీట్ రూట్ జ్యూస్ తయారు చేయడం చాలా సులభం. దుంపలను రసం చేయొచ్చు లేదా ఇతర పండ్లు లేదా కూరగాయలతో కలిపి దీన్ని తయారుచేయొచ్చు. ఆపిల్, బీట్రూట్, క్యారెట్ తో తయారుచేసిన బీట్ రూట్ జ్యూస్ చాలా ప్రాచుర్యం పొందింది.
రక్తపోటు రోగులకు బీట్ రూట్ రసం దుష్ప్రభావాలు
ఇప్పటికే బీపీ మందులు వాడుతున్న అధిక రక్తపోటు పేషెంట్లు బీట్ రూట్ జ్యూస్ వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. అందుకే దీన్ని మీ ఆహారంలో చేర్చాలని నిర్ణయించుకునే ముందు మీ వైద్యుడిని సంప్రదించడం మంచిది.
నిపుణుల ప్రకారం.. బీట్రూట్ శరీరంపై ఎక్కువ దుష్ప్రభావాలను కలిగించదు. కానీ హైపోటెన్షన్ ఉన్నవారు దీనిని తాగకపోవడమే మంచిది. అలాగే ఇందులో ఆక్సలేట్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అందుకే మూత్రపిండాల్లో రాళ్ళు, ప్రకోప ప్రేగు సిండ్రోమ్ ఉన్నవారు బీట్రూట్ కు దూరంగా ఉండాలి.