ప్రస్తుత కాలంలో సంతానలేమి ప్రధాన సమస్యగా మారుతోంది. ఈ సమస్యను అధిగమించడానికి హాస్పటల్ల చుట్టూ తిరిగేవారు చాలా మందే ఉన్నారు. సరైన పోషణ, సరైన జీవనశైలి సంతానోత్పత్తిని మెరుగుపరచడానికి సహాయపడతాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. వంధ్యత్వం మిలియన్ల మంది ప్రజలను ప్రభావితం చేస్తోంది. ఇది వారి కుటుంబాలను, సమాజాన్ని ప్రభావితం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా పునరుత్పత్తి వయసులో ఉన్న ప్రతి ఆరుగురిలో ఒకరు సంతానలేమికి గురవుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. అండాశయం, గర్భాశయం, ఫెలోపియన్ గొట్టాలు, ఎండోక్రైన్ వ్యవస్థలో కనిపించే అసమానత వల్ల మహిళల్లో వంధ్యత్వం సమస్య వస్తుంది.