రోజంతా అలసిపోయినట్లు అనిపిస్తే, అది శరీరంలో నీటి కొరతకు సంకేతం. కాబట్టి ఎక్కువ నీరు తాగండి. ఇది శరీరం బాగా పనిచేయడానికి సహాయపడుతుంది.
తలనొప్పి, మైకం:
డీ హైడ్రేషన్ తలనొప్పి, మైగ్రేన్, మైకం లాంటి సమస్యలకు కారణమవుతుంది. తరచుగా తలనొప్పితో బాధపడుతుంటే, ఎక్కువ నీరు తాగాలి. అకస్మాత్తుగా మైకం వస్తే, శరీరానికి ఎక్కువ నీరు అవసరమని అర్థం. కాబట్టి ఈ సంకేతాలను విస్మరించకూడదు.