యోగా ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతిరోజూ యోగాసనాలు వేయడం ద్వారా మానసిక ఒత్తిడి తగ్గుతుంది. రోజంతా చురుగ్గా, ఉత్సాహంగా ఉండటంతో పాటు గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది అంటున్నారు నిపుణులు.
ఒత్తిడి కారణంగా శరీరంలో కార్టిసాల్, అడ్రినలిన్ లాంటి హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. దీనివల్ల గుండె దడ, అధిక రక్తపోటు, గుండె వాపు, తదితర సమస్యలు వస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి చేయవాల్సిన ఆసనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.