పొడువైన జుట్టు కోసం పెరుగుతో ఇలా ట్రై చేయండి!

Navya G   | Asianet News
Published : Dec 25, 2021, 02:05 PM IST

కలుషిత వాతావరణం, తీసుకునే ఆహారంలో పోషకాల లోపం ఇలా అనేక కారణాలు జుట్టు సమస్యలకు (Hair problems) కారణమవుతున్నాయి. ఈ సమస్యలను తగ్గించుకోవడానికి బయట మార్కెట్లో దొరికే వివిధ రకాల కండీషనర్ లను, షాంపూలను, క్రీమ్స్ లను వాడడం తగ్గించి ఇంట్లోనే సహజసిద్ధమైన చిట్కాల్ని ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. అయితే పెరుగుతో చేసుకొనే హెయిర్ ప్యాక్స్ (Hair packs) జుట్టు సంరక్షణకు మంచి ఫలితాలనిస్తాయని బ్యూటీషియన్స్ తెలుపుతున్నారు. ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా పెరుగుతో చేసుకునే హెయిర్ ప్యాక్స్ గురించి తెలుసుకుందాం..  

PREV
16
పొడువైన జుట్టు కోసం పెరుగుతో ఇలా ట్రై చేయండి!

పొడిబారిన జుట్టు కోసం: వాతావరణంలోని మార్పులు, కాలుష్యాల కారణంగా జుట్టు పొడిబారి నిర్జీవంగా, కాంతిహీనంగా మారుతుంది. పొడిబారిన జుట్టుకు ఈ హెయిర్ ప్యాక్ ను ట్రై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇందుకోసం ఒక కప్పులో మూడు టేబుల్ స్పూన్ ల పెరుగు (Curd), నాలుగు టేబుల్ స్పూన్ ల కలబంద గుజ్జు (Aloe vera pulp), రెండు టేబుల్ స్పూన్ ల కొబ్బరి నూనె (Coconut oil) వేసి బాగా కలుపుకోవాలి.
 

26

ఈ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించాలి. అరగంట తరువాత గోరువెచ్చటి నీటితో గాఢత తక్కువగా ఉండే షాంపూ (Shampoo) తలంటుస్నానం చేయాలి. ఈ మిశ్రమం జుట్టుకు మంచి కండిషనర్ గా పనిచేసి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. జుట్టుకు కావల్సిన తేమను అందించి పొడిబారిన జుట్టును (Dry hair) ఆరోగ్యంగా ఉంచుతుంది. జుట్టుకు మంచి నిగారింపును అందిస్తుంది. 
 

36

చుండ్రు సమస్య: తలలో ఇన్ఫెక్షన్ ల కారణంగా ఏర్పడిన చుండ్రు, అలర్జీ వంటి సమస్యలను తగ్గించడానికి ఈ హెయిర్ ప్యాక్ బాగా సహాయపడుతుంది. పెరుగులో అధిక మొత్తంలో ఉండే యాంటీ ఫంగల్ గుణాలు చుండ్రుని తగ్గిస్తాయి. ఇందుకోసం ఒక కప్పు పెరుగులో (Curd) కొద్దిగా నిమ్మరసం (Lemon juice), కొద్దిగా తేనె (Honey) వేసి బాగా కలుపుకోవాలి.
 

46

ఈ మిశ్రమాన్ని తల మాడు నుంచి జుట్టు మొత్తానికి అప్లై చేసుకోవాలి. 45 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం (Head bath) చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. చుండ్రు (Dandruff) సమస్యల నుంచి శాశ్వతంగా పరిష్కారం లభిస్తుంది.
 

56

జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది: పోషకాల లోపం కారణంగా జుట్టు అధిక మొత్తంలో రాలిపోవడం జరుగుతుంది. అయితే పెరుగు జుట్టు రాలే సమస్యను తగ్గించడానికి మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఇందుకోసం ఒక గిన్నెలో సగం కప్పు పెరుగు (Curd), మూడు టేబుల్ స్పూన్ ల మెంతి పొడిని (fenugreek powder) వేసి బాగా కలుపుకోవాలి.
 

66

ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి జుట్టు మొత్తానికి అప్లై చేసుకోవాలి. అరగంట తరువాత తక్కువ గాఢత గల షాంపూతో తలస్నానం చేయాలి. ఈ హెయిర్ ప్యాక్ (Hair pack) జుట్టు రాలే సమస్యను తగ్గించి జుట్టు ఒత్తుగా, నల్లగా, అందంగా పెరగడానికి సహాయపడుతుంది. ఇది జుట్టుకు మంచి కండిషనర్ (Conditioner) గా పనిచేస్తుంది.

click me!

Recommended Stories