మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఇది మనం చిన్నప్పటి నుంచి వింటున్నదే. మన శరీరాన్ని అనారోగ్యం బారిన పడేసి.. మనల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. అయితే.. ఇదే ఆల్కహాల్ లో కొన్ని రకాలు నిజంగానే మేలు చేస్తాయట. నాలుగు రకాల ఆల్కహాల్ తాగితే.. అనారోగ్యం కాదు.. ఆరోగ్యాన్ని అందిస్తుందట. మరి ఆ రకాలేంటో ఓసారి చూసేద్దామా..
.షాంపేన్..షాంపేన్ ద్రాక్షతో తయారవుతుందని మనందరికీ తెలుసు, షాంపేన్ తయారీకి ఉపయోగించే ద్రాక్షలో ఫినోలిక్ సమ్మేళనాలు అధికంగా ఉన్నాయని నిరూపితమైంది. ఇది మెదడు ఆరోగ్యాన్ని పెంచడానికి సహాయం చేస్తుంది.ఇది చాలా కాస్ట్లీ డ్రింక్. 17 వ శతాబ్దంలో, వైన్ తయారీదారులు ఎక్కువ సమయం గడిపారు మరియు పానీయం నుండి ఫిజి బుడగలు ఎలా పొందాలో ప్రయత్నిస్తున్నారు. ఒక ఫ్రెంచ్ సన్యాసి, డోమ్ పియరీ పెరిగ్నాన్ దీనిని తయారు చేశాడు. ఉత్సాహంతో అతను తన తోటి సహోద్యోగులను పిలిచి ఈ విషయాన్ని అందరితో పంచుకున్నాడు.
రెడ్ వైన్..రైడ్ వైన్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీనిలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. అంతేకాకుండా గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహించే పాలీఫెనాల్స్ కూడా కలిగి ఉంటుంది. రెడ్ వైన్ తాగడం వల్ల లివర్ పాడౌతుందనే భయం అస్సలు అక్కర్లేదని.. చాలా పరిశోధనల్లో తేలింది. ఇది గుండె ఆరోగ్యం, ఎముక సాంద్రత , మెదడు ఆరోగ్యానికి కూడా మంచిది.
3.కొంబుచ్చా.. ఇది పులియబెట్టిన టీ నుండి తయారవుతుంది మరియు తక్కువ ఆల్కహాల్ కలిగి ఉంటుంది. కాబట్టి ఇది తీసుకోవడం వల్ల అనారోగ్యం కలగదు. అయితే.. కొందరు ఎక్కువ ఆల్కహాల్ తో కూడా హార్డ్ కొంబుచ్చాను తయారు చేస్తున్నారు. అది మాత్రం ఆరోగ్యానికి మంచిది కాదు. తక్కువ ఆలస్కహాల్ తో తయారు చేసిన ఈ మద్యం రక్తపోటు , కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది
4.టకీలా.. నిపుణుల అభిప్రాయం ప్రకారం, టకిలా కాల్షియం శోషణను పెంచుతుంది. ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. టకిలా వంటి స్పష్టమైన పానీయాలు కేలరీలు తక్కువగా, చక్కెర తక్కువగా ఉన్నాయని మరియు మన శరీరానికి జీవక్రియ చేయడానికి సులభమైనదని నమ్ముతారు. కాబట్టి.. ఈ నాలుగు రకాల మద్యాన్ని మాత్రం ఎలాంటి భయం లేకుండా ఆస్వాదించవచ్చు. అయితే.. అది కూడా మితంగా తీసుకుంటేనే మంచిది.