సమ్మర్ లో కాఫీ తాగితే ఏమౌతుందో తెలుసా?

First Published May 22, 2024, 9:57 AM IST

వానాకాలం, ఎండాకాలం అంటూ తేడా లేకుండా మనం ప్రతిరోజూ టీ, కాఫీలను తాగుతుంటాం. కాఫీ తాగడం మన దైనందిన జీవితంలో ఒక భాగమైపోయింది. కానీ ఎండాకాలంలో కాఫీ తాగితే ఏమౌతుందో తెలిస్తే షాక్ అవుతారు. 

మనలో ప్రతి ఒక్కరూ ఒకటి లేదా రెండు కప్పుల కాఫీని ఖచ్చితంగా తాగుతుంటారు. ఆఫీసులకు వెళ్లినవారే కాకుండా ఇంటి దగ్గర ఉండేవారు కూడా కాఫీని తాగుతుంటారు. కాఫీ మన ఆరోగ్యానికి కొంత మేలు కూడా చేస్తుంది. కానీ దీనిలో ఉండే కెఫిన్ మన ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఎండాకాలంలో ఉష్ణోగ్రత పెరిగినప్పుడు మన శరీరం చల్లగా ఉండాలి. అయితే బాడీని కూల్ చేయడానికి కాఫీ సహాయపడదు. అసలు సమ్మర్ లో కాఫీ తాగితే వచ్చే సమస్యలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 


డీహైడ్రేషన్

కాఫీలో ఉండే కెఫిన్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇది చెమట ఉత్పత్తిని పెంచుతుంది. అలాగే శరీరంలో నీటి నష్టానికి దారితీస్తుంది. దీంతో మీరు డీహైడ్రేషన్ బారిన పడతారు. సమ్మర్ లో డీహైడ్రేషన్ బారిన పడటం మంచిది కాదు. అందుకే ఈ సీజన్ లో కాఫీని కాకుండా నీళ్లను ఎక్కువగా తాగాలి. 
 

శరీర ఉష్ణోగ్రత

కాఫీలో ఉండే కెఫిన్ కంటెంట్ మన శరీర ఉష్ణోగ్రతను బాగా పెంచుతుంది. ఇది వేడిని భరించలేనిదిగా చేస్తుంది. అలాగే ఇది ఎక్కువ చెమట పట్టేలా చేస్తుంది. అలాగే అలసట, మైకమును కలిగిస్తుంది. కాఫీ తాగడం వల్ల సమ్మర్ లో వికారం వంటి సమస్యలను కూడా ఎదుర్కొవాల్సి వస్తుంది. 
 

నిద్ర లేమి

చాలా మంది రాత్రిపూట పనిచేయడానికి మెలుకువగా ఉండాలని కాపీని తాగుతుంటారు. కానీ ఇది మీ ఆరోగ్యానికి ఎంతమాత్రం మంచిది కాదు. ఎందుకంట కాఫీలో కెఫిన్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది రాత్రిపూట మీ నిద్ర నాణ్యతపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఇది మిమ్మల్ని చంచలంగా, మరింత అలసిపోయేలా చేస్తుంది.
 

గుండెపోటు ప్రమాదం 

కెఫిన్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండెజబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇది గుండెపోటు, అధిక రక్తపోటు ప్రమాదాల్ని చాలా వరకు పెంచుతుంది. అందుకే గుండె జబ్బులతో బాధపడేవారు కాఫీ తాగకపోవడమే మంచిది.

Latest Videos

click me!