ఎలాంటి ప్రోటీన్ పౌడర్ ను వాడాలో తెలుసా?

First Published | Nov 14, 2024, 3:49 PM IST

చాలా మంది ప్రోటీన్ పౌడర్ ను రోజూ వాడుతుంటారు. అయితే మీరు ఈ ప్రోటీన్ పౌడర్ ను కొనే ముందు కొన్ని జాగ్రత్తలను ఖచ్చితంగా తీసుకోవాలి. అవేంటంటే?

ఈ రోజుల్లో చాలా మంది ఆరోగ్యం, ఫిట్ నెస్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. ఫిట్ గా ఉండేందుకు చాలా మంది తమ రోజువారి డైట్ లో ప్రోటీన్ పౌడర్ ను చేర్చుకుంటున్నారు. ముఖ్యంగా వ్యాయామం చేసేవారు. మంచి శరీరాకృతిని పొందాలనుకునేవారు. వీళ్లు ప్రోటీన్లు పుష్కలంగా ఉండే ఆహారాలతో పాటుగా ప్రోటీన్ పౌడర్ ను కూడా తీసుకుంటున్నారు. 

నిజానికి ప్రోటీన్ పౌడర్ మన శరీరానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. ఇది మన శరీర అవసరాలను తీరుస్తుంది. అలాగే మంచి ప్రోటీన్ పౌడర్ వ్యాయామం చేసేవారికి ఎంతో సహాయపడుతుంది. అయితే మీరు ఈ ప్రోటీన్ పౌడర్ ను తప్పుగా లేదా సరిగ్గా ఉపయోగించకపోతే మాత్రం ప్రయోజనాలను బదులుగా నష్టాలను చూస్తారు. అంటే ఇది మీకు లేనిపోని సమస్యలను కలిగిస్తుంది. 

అందుకే ఫిట్ నెస్, మంచి శరీరం కోసం ఎలాంటి ప్రోటీన్ పౌడర్ ను వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 


ప్రోటీన్ పౌడర్ కొనే ముందు గుర్తుంచుకోవలసిన విషయాలు

1. ప్రతి ఒక్కరికీ ప్రోటీన్ పౌడర్ అవసరం లేదు

అవును ప్రతి ఒక్కరూ ప్రోటీన్ పౌడర్ ను తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ప్రోటీన్లను తక్కువగా తీసుకునేవారికి మాత్రమే అవసరమవుతుందని నిపుణులు చెబుతున్నారు. మీరు గుడ్లు, చేపలు, మాంసం,పాలు వంటి ప్రోటీన్లు పుష్కలంగా ఉండే ఆహారాలను రెగ్యులర్ గా తినే వారికి ప్రోటీన్ పౌడర్ అవసరం లేదు. వీళ్లు ప్రోటీన్ పౌడర్ ను తీసుకోకపోవడమే మంచిది.

2. సరైన బ్రాండ్

మార్కెట్లో మనకు ఎన్నో రకాల ప్రోటీన్ పౌడర్ బ్రాండ్లు కనిపిస్తుంటాయి. దీనివల్ల మనకు ఏది మంచిది అని కనిపెట్టడం కష్టమే. కాబట్టి నిపుణులను సంప్రదించి మంచి బ్రాండ్ ను కొనాలి.  ఎప్పుడైనా సరే ప్రముఖ బ్రాండ్ ను మాత్రమే తీసుకోండి. ప్రోటీన్ పౌడర్ ను కొనే ముందు దాని లేబుల్‌ ను ఖచ్చితంగా చదవండి. మీరు కొనే పౌడర్ లో చక్కెర, కృత్రిమ పదార్థాలు తక్కువగా ఉండేలా చూసుకోండి. 

3. వైద్యులు చెప్పేది వినండి

వ్యాయామం చేసేవారైతే డాక్టర్ ను ఖచ్చితంగా సంప్రదించండి. అంటే వారు చెప్పిన మోతాదులోనే ప్రోటీన్ పౌడర్ ను తీసుకోండి. ఇలా చేస్తేనే మీరు మంచి ఫలితాలను పొందుతారు. మీకు ఏదైనా సమస్య ఉంటే వెంటనే హాస్పటల్ కు వెళ్లండి.

4. ఫిట్‌నెస్ ఆధారంగా ఎంచుకోండి

 ప్రోటీన్ పౌడర్ మంచిదైనప్పటికీ..  దీనిని మీ వ్యాయామానికి తగ్గట్టు ఎంచుకోవాలంటారు నిపుణులు. మీరు గనుక మీ కండరాలను పెంచుకోవాలనుకుంటే గోధుమ ప్రోటీన్ పౌడర్‌ను తీసుకోండి.  మీరు శాఖాహారంతో వ్యాయామాన్ని మెరుగుపరచాలనుకుంటే సోయా ప్రోటీన్ పౌడర్‌ను వాడండి. 

5. ప్రోటీన్ పౌడర్ రుచి

ప్రోటీన్ పౌడర్లు ఎన్నో రకాల రుచుల్లో దొరుకుతాయి. అందుకే దీన్ని కొనేటప్పుడు దాని రుచిని చూసి కొనండి. అంటే మీరు తీసుకోదగినది అయితేనే కొనండి. లేదంటే అది వేస్ట్ అవుతుంది.

Latest Videos

click me!