నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఒక వ్యక్తి రోజుకు ఒకటి నుండి రెండు టీస్పూన్లు (సుమారు 10 గ్రాములు) చక్కెర తీసుకోవచ్చని చెబుతున్నాయి. ప్రస్తుతం డయాబెటిస్, కొలెస్ట్రాల్, ఊబకాయం లాంటి వ్యాధులు పెరుగుతున్నందున చక్కెర లేకుండా జీవించమని ప్రజలకు సూచిస్తున్నారు.
కానీ చక్కెరను మాత్రమే తగ్గించడం వల్ల అన్ని ప్రయోజనాలు లభిస్తాయని చెప్పలేం. మనం తినే బియ్యం, చపాతీలు కూడా చక్కెరలా పనిచేస్తాయి. కాబట్టి వ్యాయామం, మంచి ఆహారపు అలవాట్లు కూడా పాటించాలి.