గాలి, వెలుతురు, ఎక్కువ వేడికి గురైతే ఓట్స్ చెడిపోయి రుచి, పోషకాలను కోల్పోతాయి. అంతేకాకుండా ఓట్స్‌ని సరిగ్గా నిల్వ చేయకపోతే ఫంగస్ రావచ్చు. కీటకాలు కూడా చేరొచ్చు. దీంతో అసలు రుచిని కోల్పోయి చేదుగా మారతాయి.
ఓట్స్ చెడిపోకుండా ఉండాలంటే అవి బాగా ఎండినవై ఉండాలి. ఎండిన ఓట్స్‌లో తేమ తక్కువగా ఉంటుంది. అందువల్ల అవి చెడిపోయే అవకాశం చాలా తక్కువ.